కొత్త సినిమాకు ముహూర్తం పెట్టిన దర్శకేంద్రుడు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్వరలోనే కొత్త సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే తన తదుపరి సినిమా ప్రారంభించనున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్వరలోనే కొత్త సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే తన తదుపరి సినిమా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బంధుమిత్రుల సమక్షంలో ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారరు. ఈ నెల 9న ఉదయం గం.11.30ని.లకు తన కొత్త సినిమా విశేషాలు వెల్లడించేందుకు రెడీ అయ్యారు. చాలాకాలం తర్వాత దర్శకేంద్రుడి నుంచి సినిమా వస్తుండటం వల్ల ఆనందంలో ఉన్నారు సినీ అభిమానులు. (మెహబూబ్ ఘాటు వ్యాఖ్యలు, ఇచ్చి పడేసిన అఖిల్ )
అటు మాస్ మూవీస్, భక్తిరస చిత్రాలు, ఇటు రక్తి కట్టించే సినిమాలు తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఈసారి ఏ నేపధ్యంలో సినిమా తీస్తారు? హీరోగా ఎవరు నటించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో అప్పుడే మొదలైంది. 2017లో అక్కినేని నాగార్జునతో ఓం నమోవెంకటేశాయ సినిమాను తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. ఆ తర్వాత ఇంటింటా అన్నమయ్య ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలుకరించారు. ( Bigg Boss Telugu 4: టాస్క్ గెలవడానికి అభి ట్రిక్, హర్టయిన హారిక )
Stay tuned.. pic.twitter.com/16uMDrNHbf
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2020




