రియా చక్రవర్తికి ధైర్యాన్ని, మద్దతును తెలిపిన సెలబ్రిటీలు

డ్రగ్స్‌ ఆరోపణలపై గత నెల ఆరంభంలో అరెస్ట్‌ అయిన నటి రియా చక్రవర్తికి ఎట్టకేలకు ముంబాయి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతిలో చనిపోయిన తర్వాత రియా చక్రవర్తిపై పలువురు విమర్శలు గుప్పించారు.. ఆమెపై నిందలు మోపారు.. ఆమె కారణంగానే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో రాతలు రాశారు.. ఏమైతేనేం రియాకు బెయిల్‌ వచ్చింది.. ఆమెకు బెయిల్‌ ఇవ్వడాన్ని సినీ పరిశ్రమకు చెందిన […]

రియా చక్రవర్తికి ధైర్యాన్ని,  మద్దతును తెలిపిన సెలబ్రిటీలు
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Oct 08, 2020 | 2:28 PM

డ్రగ్స్‌ ఆరోపణలపై గత నెల ఆరంభంలో అరెస్ట్‌ అయిన నటి రియా చక్రవర్తికి ఎట్టకేలకు ముంబాయి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతిలో చనిపోయిన తర్వాత రియా చక్రవర్తిపై పలువురు విమర్శలు గుప్పించారు.. ఆమెపై నిందలు మోపారు.. ఆమె కారణంగానే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో రాతలు రాశారు.. ఏమైతేనేం రియాకు బెయిల్‌ వచ్చింది.. ఆమెకు బెయిల్‌ ఇవ్వడాన్ని సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్వాగతించారు. రియాకు సపోర్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన వారందరిపైనా విచారణ చేపట్టాలని నటి హుమా ఖురేషి డిమాండ్‌ చేశారు. వ్యక్తిగత ఎజెండాల కోసం ఓ అమ్మాయిని, ఆమె కుటుంబగౌరవాన్ని నాశనం చేసిన వారిని చూస్తుంటే సిగ్గుగా ఉందంటూ రియాకు మద్దతుగా సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.. రియాకు తాప్సీ ధైర్యాన్ని నూరిపోశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎజెండాలతో సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ లేనిపోని కోపం తెచ్చుకున్నవారు రియా ఇన్ని రోజులపాటు జైలులో ఉండటాన్ని చూసిన తర్వాత ఇప్పుడు శాంతించారనుకుంటానని తాప్సీ పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన సంఘటనల వల్ల జీవితం పట్ల రియాలో నిరాశ నిస్పృహలు రాకుండా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు తాప్సీ. ఇక ఇప్పుడు ఇంటికెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోమని రియాకు సూచించారు హన్సల్‌ మెహ్తా. రియాపై కొంచెం దయ చూపించినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఫరా ఖాన్‌.. ఎట్టకేలకు రియాకు బెయిల్ వచ్చిందంటూ అనుభవ్‌ సిన్హా వ్యాఖ్యానించారు.