AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 78,524 పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ ప్రకోపానికి ప్రపంచం విలవిలలాడుతోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది.

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 78,524 పాజిటివ్ కేసులు
Balaraju Goud
|

Updated on: Oct 08, 2020 | 10:07 AM

Share

కరోనా వైరస్ ప్రకోపానికి ప్రపంచం విలవిలలాడుతోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య పదిన్నర లక్షలకు చేరుకుంటోంది. భారత్ తోసహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించిన కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

భారత్‌లో 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 78,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఒక్క రోజులోనే దేశంలో కరోనా బారినపడి మొత్తం 971 మంది మరణించారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 68,35,656కు చేరుకుంది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 1,05,526 మంది కరోనాను జయించలేక మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,02,425 గా ఉంది. ఇక ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకుని 58,27,704 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను గురువారం ఉదయం కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.

ఇక దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కరోనా రోగుల రికవరీ రేటు 85.25 శాతంగా నమోదైంది. దేశంలో నమోదవుతన్న కేసుల్లో మొత్తం యాక్టివ్ కేసులు13.20 శాతం మాత్రంగా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. మరోవైపు దేశంలో నమోదవుతున్న కేసుల్లో మొత్తంగా చూస్తే మరణాల రేటు 1.54 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11,94,321 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,34,65,975 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే