వెండితెరపై ఎవర్‌గ్రీన్ క్వీన్, రెమ్యూనరేషన్ సెన్సేషన్ !
రమ్యక్రిష్ణ...వెండితెరపై తిరుగులేని బ్యూటీ ఐకాన్. అదిపోయే అందం, మచ్చపెట్టలేని అభినయంతో దశాబ్దాల పాటు సౌత్ ఇండియా టాప్ హీరోయిన్‌గా ఆమె చక్రం తిప్పారు.

రమ్యక్రిష్ణ…వెండితెరపై తిరుగులేని బ్యూటీ ఐకాన్. అదిపోయే అందం, మచ్చపెట్టలేని అభినయంతో దశాబ్దాల పాటు సౌత్ ఇండియా టాప్ హీరోయిన్‌గా ఆమె చక్రం తిప్పారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అంతేస్థాయిలో రాణిస్తున్నారు. ఆమె హీరోహీరోయిన్ల అమ్మ పాత్రలు వేయబట్టి కూడా చాలా కాలమైంది. అయినా రమ్యక్రిష్ణ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. బాహుబలిలో శివగామి పాత్రలో ఆమె నటన న భూతో న భవిష్యతి. ఆమె సినిమాలో నటించిందంటే, కొత్త అట్రాక్షన్ యాడ్ అయినట్లే. దీంతో రోజురోజుకి రమ్యక్రిష్ణకి డిమాండ్ పెరిగిపోతోంది. ( Bigg Boss Telugu 4: టాస్క్ గెలవడానికి అభి ట్రిక్, హర్టయిన హారిక )
ప్రస్తుతం పలు సినిమాల్లో పవర్‌ఫుల్ రోల్స్ ప్లే చేస్తోన్న రమ్యక్రిష్ణ, అంతేస్థాయిలో పారితోషకం తీసుకుంటున్నారట. 50ఏళ్ల వయసులోనూ యంగ్‌బ్యూటీస్‌ని కూడా డామినేట్ చేస్తూ, ఆమె కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. ప్రస్తుతం రోజుకి 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందట రమ్యక్రిష్ణ. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే కోటి వరకు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. రమ్యక్రిష్ణ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫైటర్’తో పాటు, సాయితేజ్-దేవకట్టా సినిమాలోనూ నటిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న రష్మిక మందన్న సినిమాకు కోటిన్నర వరకు తీసుకుటుంది. దీన్ని బట్టి చూస్తే రమ్యక్రిష్ణ స్టాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ( మెహబూబ్ ఘాటు వ్యాఖ్యలు, ఇచ్చి పడేసిన అఖిల్ )




