Raj Tarun: ‘ఆ హీరోయిన్‌తో అఫైర్.. నన్ను మోసం చేశాడు..’ రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు

రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలి. నాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది లావణ్య. తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని చెబుతోంది. ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదని వాపోయింది.

Raj Tarun: 'ఆ హీరోయిన్‌తో అఫైర్.. నన్ను మోసం చేశాడు..' రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు
Hero Rajtarun Lavanya
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 05, 2024 | 1:14 PM

హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది.  3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది.

లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు. అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది.

అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. మాల్వీ మల్హోత్రతో ఎఫైర్‌ కారణంగానే రాజ్‌తరుణ్‌ తనను పక్కనబెట్టాడనీ లావణ్య అంటోంది. మాల్వీ మల్హోత్రాను కలుసుకోవడానికి తరచూ రాజ్‌తరుణ్‌ ముంబై వెళ్లేవాడని లావణ్య చెబుతోంది. అంతేగాదు, రాజ్‌తరుణ్‌ లైఫ్‌ నుంచి బయటకు వెళ్లడానికి మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను డబ్బు ఆశ చూపించారనీ, ఎంతకూ వినకపోతే చంపేస్తామని బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులో వివరించింది. కానీ తాను రాజ్‌తరుణ్‌ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది.

రాజ్ తరుణ్ ప్రస్తుతం.. ‘తిరగబడరసామీ’  మూవీ చేస్తున్నాడు. ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.  మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ఇందులో హీరోయిన్స్‌గా నటించారు. ఇండస్ట్రీకి ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్ సినిమాలు చేసి హ్యాట్రిక్స్ హిట్స్ అందుకున్నాడు. గత 8 ఏళ్లుగా అతనికి సరైన హిట్టు లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.