AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivaha Bhojanambu Review: నవ్వుల వంటకంబు ఈ వివాహ భోజనంబు.. ఆకట్టుకున్న కమెడియన్ సత్య..

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్‌ అయ్యారు. కామెడీ టైమింగ్‌ తో పాటు తమలో హీరోయిజం కూడా ఉందని ఇప్పటికే

Vivaha Bhojanambu Review: నవ్వుల వంటకంబు ఈ వివాహ భోజనంబు..  ఆకట్టుకున్న కమెడియన్ సత్య..
Satya
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 28, 2021 | 8:39 AM

Share

నటీనటులు: సత్య-ఆర్జవీ-శ్రీకాంత్ అయ్యంగార్-సుదర్శన్-సందీప్ కిషన్-వైవా హర్ష నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి మాటలు: నందు ఆర్కే స్క్రీన్ ప్లే: భాను భోగవరపు-రామ్ అబ్బరాజు నిర్మాతలు: శినీష్-సందీప్ కిషన్ దర్శకత్వం: రామ్ అబ్బరాజు

సంగీతం: అనివీ

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్‌ అయ్యారు. కామెడీ టైమింగ్‌ తో పాటు తమలో హీరోయిజం కూడా ఉందని ఇప్పటికే చాలమంది నిరుపించుకున్నరు. అలీ, సునీల్‌, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు హీరోలుగా సినిమాలు చేసి ఆకట్టుకున్నరు. తాజాగా కమెడియన్ సత్యకూడా హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకొనున్నాడు. సత్య ప్రధాన పాత్రలో వివాహభోజనంబు అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ : 

మహేష్ (సత్య) పిసినారైన కుర్రాడు. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించడమే కాక ఆర్థికంగా కూడా అంత మంచి స్థితిలో లేని అతణ్ని ఓ డబ్బున్న అందమైన అమ్మాయి ప్రేమిస్తుంది. ఆమె తండ్రికి మహేష్ అంటే అస్సలు ఇష్టం లేకపోయినా.. కానీ అనుకోని కారణాల వల్ల పెళ్లికి ఓకే చెప్పాల్సి వస్తుంది. మహేష్ పెళ్లి చేసుకున్న సమయానికే కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలై అమ్మాయి తరఫు బంధువులంతా అతడి ఇంట్లోనే  ఇరుక్కుపోతారు. వారి వల్ల మహేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతనంత పిసినారిగా ఉండటానికి కారణమేంటి..అనేది సినిమాలో చూడాల్సిందే.

కథనం-విశ్లేషణ:

కరోనా నేపథ్యంలో  సాగే కథ ఇది. ‘వివాహ భోజనంబు’ ట్రైలర్ చూడగానే ఇదొక హిలేరియస్ ఎంటర్టైనర్ అనే క్లారిటీ ఇచ్చేశారు. నిజ జీవితంలో మనల్ని కష్టపెట్టే విషయాల్ని తెరపై చూపించి నవ్వులు పూయించారు. ఈ కోవలోనే కరోనా సమయంలో జనాలు పడ్డ కష్టాలు.. ఎదుర్కొన్న భిన్న అనుభవాల చుట్టూ అల్లుకున్న ‘వివాహ భోజనంబు’లో బేసిక్ పాయింట్స్ ఆసక్తి రేకెత్తిస్తుంది. పిసినారి అయిన మహేష్ ఇంట్లో లాక్ డౌన్ కారణంగా బంధువులంతా ఇరుక్కుపోతే అన్న ఆలోచనే హిలేరియస్ గా అనిపిస్తుంది. ‘వివాహ భోజనంబుతో హీరోగా మారిన కమెడియన్ సత్యనే. ఈ సినిమా చూస్తే సత్య కోసమే చూడాలి అన్నట్లుగా అతను అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి పాత్ర ఆగమనంతోనే ప్రేక్షకులు ‘వివాహ భోజనంబు’లో ఇన్వాల్వ్ అయిపోతారు. సత్య లాంటి పర్సనాలిటీని ఓ అందమైన అమ్మాయి ప్రేమించడం.. అలాంటి అమ్మాయి ముందు మొహమాటం లేకుండా తన పిసినారితనాన్ని ప్రదర్శించడం.. ఈ కోవలో వచ్చే సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. సత్యను ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించిందనే విషయాన్ని సస్పెన్సులా దాచి ఉంచి.. అతడి పెళ్లి.. తదనంతర పరిణామాల మీద ప్రథమార్ధంలో కథను నడిపించారు. లాక్ డౌన్ కారణంగా హీరోయిన్ ఫ్యామిలీ అంతా హీరో ఇంట్లో చిక్కుకునే సందర్భంలో కథ రసకందాయంలో పడ్డట్లే కనిపిస్తుంది.

లాక్ డౌన్ కర్ఫ్యూ టైంలో పోలీసులు పట్టుకుంటే ఆశీర్వాద్ గోధుమ పిండి కోసం వెళ్లాననడం.. వాళ్ల చేతుల్లో దెబ్బలు తినొచ్చాక బయట పోలీసులున్నారా అని అడిగితే వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారనడం.. ఇలాంటి సన్నివేశాలు ఇందుకు ఉదాహరణ. ఇవే కాక కరోనా టైంలో జరిగిన అనేక పరిణామాలను సినిమాలో చూపించారు.  హీరోను హీరోయిన్ ఎందుకు ప్రేమించిందో చూపించే ఫ్లాష్ బ్యాక్  సెకండ్ ఆఫ్ లో చూపించారు. తన భార్య బంధువులు ఇంటి నుంచి పంపించేయడానికి హీరో చేసిన ప్రయత్నాలు చివరి ఆకట్టుకున్నాయి.. చివర్లో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి అతడి మీద తన మావయ్య అభిప్రాయాన్ని మారుస్తారని ముందే ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేస్తుంది. సుదర్శన్.. శివన్నారాయణల సహకారంతో సత్య వీలైనంత వరకు తన కామెడీ టైమింగ్ తో సన్నివేశాలను పండించాడు.

నటీనటులు:

సత్య ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న కామెడీ పాత్రల్లోనే అదరగొట్టేసే అతను.. హీరోగా ఫుల్ లెంగ్త్ హీరో రోలో ఆకట్టుకున్నాడు. పదే పదే తన మావయ్యకు దొరికిపోయే సన్నివేశాల్లో కవర్ చేస్తూ అతను ఇచ్చే హావభావాలు భలేగా అనిపిస్తాయి. నూటికి నూరు శాతం తన పాత్రకు అతను న్యాయం చేశాడు. తన కోసం ఓసారి సినిమా చూడొచ్చు అనిపించాడు సత్య. కామెడీ సీన్లలోనే కాక.. చివర్లో రెండు మూడు ఎమోషనల్ సీన్లలోనూ సత్య మెప్పించాడు. హీరోయిన్ ఆర్జవీ లుక్స్ పరంగా ఆకట్టుకుంది. శ్రీకాంత్ అయ్యంగార్ హీరోతో సమానమైన పాత్రలో ఓకే అనిపించాడు. సందీప్ కిషన్ తన వంతుగా బాగానే చేశాడు. సుదర్శన్ నెల్లూరు యాసతో మరోసారి ఆకట్టుకున్నాడు. అతను.. ‘అమృతం’ ఫేమ్ శివన్నారాయణ.. హీరో తర్వాత ఈ సినిమాలో నవ్వులు పూయించారు. సుబ్బరాయశర్మ.. దివంగత టీఎన్ఆర్ బాగా చేశారు. మిగతా నటీనటులంతా తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘వివాహ భోజనంబు’ ఆకట్టుకుందని చెప్పాలి. అనివీ పాటల్లో ‘ఏబీసీడీ’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అచ్చు రాజమణి నేపథ్య సంగీతంలో కొత్తగా అనిపిస్తుంది. భలే భలే మగాడివోయ్.. ఏక్ మిని కథ లాంటి చిత్రాల స్టయిల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అలరించింది. మణికందన్ ఛాయాగ్రహణం ఓకే. ఉన్న పరిమితుల్లోనే విజువల్స్ ఆకట్టుకుంటాయి.   ఎక్కువగా ఒక ఇంట్లో నడిచే కథ కావడంతో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపించలేదు. రైటర్ భానుతో కలిసి రామ్ అబ్బరాజు వండిన కథలో కొన్ని విశేషాలున్నాయి.  ఈ కథలో కామెడీకి ఇంకా మంచి స్కోప్ ఉండటంతో సినిమా ఆకట్టుకుంది.

చివరిగా.. నవ్వుల వంటకంబు ఈ వివాహ భోజనంబు..