ఒకేసారి చెల్లి, నాన్న చనిపోయారు.. నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న బబ్లూ

అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాలో హీరోకు ఫ్రెండ్‌గా నటించిన కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? తెలుగులో కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటించిన బబ్లూ.. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి.. అనంతరం స్టార్ హీరోల చిత్రాల్లో వరుసపెట్టి ఛాన్స్‌లు దక్కించుకున్నాడు.

ఒకేసారి చెల్లి, నాన్న చనిపోయారు.. నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న బబ్లూ
Comedian Babloo

Updated on: Jan 09, 2026 | 8:01 PM

చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు నటుడు బబ్లూ. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. చాలా వరకు హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు బబ్లూ.. గత కొంతకాలంగా బబ్లూ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా రోజుల తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. బాలనటుడిగా 35 సంవత్సరాల క్రితం సినీరంగ ప్రవేశం చేసిన అతను, తన కెరీర్, స్నేహాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి మాట్లాడాడు. బబ్లూ అసలు పేరు సదానంద్. ఐదేళ్ల వయసులో ముద్దుల మేనల్లుడు సినిమాతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో నాజర్ కొడుకు పాత్రలో నటించాడు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారి అభిసారిక, లేడీస్ స్పెషల్, రామ్ బంటు, జై బజరంగబలి వంటి దాదాపు పది సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. పదకొండేళ్ల వయసులో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన, జంధ్యాల గారి పోపుల పెట్టి సీరియల్ ద్వారా బబ్లూ అనే పేరుతో పాపులర్ అయ్యాడు.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

పదో తరగతిలో ఉండగా, తేజ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆడిషన్స్ లేకుండానే తేజ గారు తనను ఎంపిక చేసుకున్నారని, తన తండ్రి ప్రోత్సాహంతోనే తొలి రోజు షూటింగ్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నటించగలిగానని బబ్లూ తెలిపారు. చిత్రం సినిమా తన జీవితాన్ని మార్చిందని, తేజ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపాడు బబ్లూ.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

తన జీవితంలో ఎంతో ఇష్టపడే తండ్రిని, సోదరిని ఒకేసారి కోల్పోయిన విషాద ఘటనలను గుర్తు చేసుకున్నాడు. తన సోదరికి ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడం వల్ల ఆమె మరణించిందని ఎమోషనల్ అయ్యాడు. అదే సమయంలో తన తండ్రిని కూడా కోల్పోయాను అని చెప్పాడు బబ్లూ. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళా.. ఆసమయంలో ఎంతో నరకం అనుభవించా అని ఎమోషనల్ అయ్యాడు. పరిశ్రమలో తన బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఆలీ అన్న, అల్లరి నరేష్‌, సుమన్, శ్రీను, వేణు, గీత, సునీల్ వంటి వారు కూడా తన సన్నిహితులేనని అన్నాడు. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చాడు బబ్లూ.

ఇవి కూడా చదవండి

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.