Game Changer: ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్.. ఏకంగా 1000 మంది ఫైటర్స్‏తో చరణ్ యాక్షన్ సీక్వెన్స్..

దాదాపు వెయ్యి మంది ఫైటర్స్ తో పోరాడేందుకు రెడీ అవుతున్నారట చరణ్. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ కోసం భారీగానే ప్లాన్ చేశారట డైరెక్టర్ శంకర్. హైదరాబాద్ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్ కోసం సెట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్ చిత్రీకరణ వచ్చే నెల తొలివారం వరకూ జరుగుతుందని సమాచారం.

Game Changer: 'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్.. ఏకంగా 1000 మంది ఫైటర్స్‏తో చరణ్ యాక్షన్ సీక్వెన్స్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 20, 2023 | 1:35 PM

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆసక్తిగా ఉండగా.. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దాదాపు వెయ్యి మంది ఫైటర్స్ తో పోరాడేందుకు రెడీ అవుతున్నారట చరణ్. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ కోసం భారీగానే ప్లాన్ చేశారట డైరెక్టర్ శంకర్. హైదరాబాద్ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్ కోసం సెట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్ చిత్రీకరణ వచ్చే నెల తొలివారం వరకూ జరుగుతుందని సమాచారం.

కాగా ఈ ఫైట్ సీన్స్ కోసం దాదాపు వెయ్యి మంది స్టంట్ మ్యాన్స్ పాల్గొంటారని.. అలాగే కేజీఎఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివు ఈ క్లైమాక్స్ ఫైట్ ను చేయనున్నట్లు సమాచారం. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ దిపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్. ఇటీవల ఆయన ఇండియన్ 2 కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన శంకర్ కమల్ హాసన్ కు థాంక్స్ చెబుతూ చరణ్ సినిమాపై మాసివ్ అప్డేట్ అందించారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ ను స్టార్ట్ చేస్తున్నామని అన్నారు. ఈ సినిమానకు థమన్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.