AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: చేతబడి నేపథ్యంలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో.. ఒంటరిగా మాత్రం చూడద్దు

ఈ మధ్యన ఓటీటీలో సస్పెన్స్, హరర్ సినిమాలకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. పొలిమేర 2, తంత్ర, పిండం తదితర సినిమాలు ఆడియెన్స్ ను బాగా భయపెట్టాయి. ఇప్పుడిదే కోవలో ఓటీటీలోకి ఒక సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చింది.

OTT: చేతబడి నేపథ్యంలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో.. ఒంటరిగా మాత్రం చూడద్దు
7/G Movie
Basha Shek
|

Updated on: Dec 12, 2024 | 3:11 PM

Share

సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ 7/G. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సోనియాతోపాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలకపాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల జులైలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. వసూళ్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టులో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఆగస్టు 09 నుంచి ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. అయితే కేవలం తమిళ్ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి నుంచే 7/G సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

7/G చిత్రానికి హరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత హీరోయిన్ సోనియా తనదైన నటనతో మెప్పించింది. గతంలో తెలుగులో సూపర్ హిట్ అయిన 7G బృందవన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా.. ఇప్పుడు మళ్లీ దాదాపు అదే టైటిల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక 7/G సినిమా కథ విషయానికి వస్తే.. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎదుర్కొంటుంది. వారి ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ప్రేక్షకులని కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో ఎట్టిపరిస్థితిలో మిస్ కావద్దు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ