Telangana: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టుకోని పిల్లలు.. కొడుకు తిక్క కుదిర్చిన ఓ తండ్రి..!
మెదక్ జిల్లాలో ఓ కొడుకు అస్తిపాస్తులు పంచుకుని తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కీలక ఆదేశాలు ఇచ్చారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకునేందుకు ప్రస్తుత కాలంలో ఇష్టపడట్లేదు. ఆస్తిపాస్తులు, బంగారం, డబ్బులు తీసుకుని తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్లను పట్టించుకోకుండా వేరే ఇంట్లో ఉంచుతున్నారు. వేరే దిక్కు లేక, చివరి రోజుల్లో అతికష్టం మీద బతుకు ఈడ్చుకుంటూ వాళ్ళు కూడా అలాగే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. కానీ ఒక పెద్దాయన మాత్రం అందరిలా ఏడ్చుకుంటూ కూర్చోకుండా, తన కొడుకుపై పోరాటం చేశాడు. కన్న కొడుకు అన్నం పెట్టడం లేదని, తమ బాగోగులు చూసుకోవడంలేని కన్న కొడుకు పేరు మీద ఉన్న భూమిని తిరిగి మళ్ళీ ఇవ్వాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి విజయం సాధించాడు.
వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా రెగోడ్ మండలానికి చెందిన ఏనుకత్తల సంగమేశ్వర రెడ్డి వయసు 77 సంవత్సరాలు. ఈయనకు ఇద్దరు కుమారులు. కాగా, పెద్ద కుమారుడు విట్టల్ రెడ్డి అనారోగ్యంతో మరణించాడు. చిన్న కుమారుడు మహిపాల్ రెడ్డి పేరు మీద ఒక ఎకరం మూడు గంటల భూమిని 1987లో తండ్రి కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చాడు. సంగమేశ్వర్ రెడ్డి వృద్ధుడు అయినప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా తన కొడుకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం వహిస్తున్నాడని, అందుకే మళ్లీ తన అస్తిని తిరిగి ఇవ్వాలని 2023 సంవత్సరంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాకు ప్రజావాణిలో విన్నవించుకున్నాడు.
దీంతో తన బాగోగులు చూడడంలేదని, కావున పోషణగా కనీసం నెలకు ఐదు వేలు ఇవ్వమని కలెక్టర్ కొడుకు చెప్పాడు. అయినా కొడుకు ససేమిరా అనడంతో, తన భూమి తనకు తిరిగి ఇవ్వాలని వృద్ధుడు కలెక్టర్ వద్ద అర్జీ పెట్టుకుని ప్రాధేయపడ్డాడు. దీంతో కలెక్టర్ చొరవ తీసుకుని సంబంధిత ఆర్డీవో, తాసిల్దార్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇరువురు కలిసి వృద్ధునికి 2007 సీనియర్ సిటిజన్ ఆక్ట్ కింద తండ్రి ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని సూచించారు. దీంతో రేగోడు తహసిల్దార్ సర్వే నంబర్ 240 లోని ఒకేకరా మూడు గంటల భూమిని వృద్ధుని పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. ఇలా అందరూ చేస్తే తల్లిదండ్రులను చూడని పిల్లలు చాలా వరకు మరే అవకాశం లేకపోలేదని స్థానికులు అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..