డయాబెటిస్‌కు ఛూమంత్రం.. దెబ్బకు షుగర్ కంట్రోల్..
Shaik Madar Saheb
12 December 2024
మధుమేహం.. పెను సమస్యగా మారుతోంది. పెద్దవాళ్లే కాదు యువత కూడా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు..
ఆహారంపై సరిగా దృష్టిపెట్టడం ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ప్రమాదకరంగా మారుతుంది..
మధుమేహం వ్యాధిని నయం చేసే ఔషధం ఇప్పటికీ అందుబాటులో లేదు. షుగర్‌ను నియంత్రించే మందులు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అయితే, కొన్ని కూరగాయాల ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. అలాంటి వాటిలో కీర దోసకాయ ఒకటి.. ఇది డయాబెటిస్‌కు మందు లాంటిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక సాధారణ సమస్య మూత్ర విసర్జన సమస్య. తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది.
దోసకాయను తీసుకోవడం ద్వారా శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు. బరువు పెరగడం కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది.
అయితే.. దోసకాయను రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును అదుపులో ఉంచుకోవడంతోపాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
కీర దోస జీర్ణశక్తిని పెంచడంతోపాటు.. పొట్టలోని అల్సర్లను తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.
ఈ విధంగా, కీర దోసకాయను సూప్, సలాడ్, ఇతర ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవడం ద్వారా మీ షుగర్ అదుపులో ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నడుము అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న రాశి సింగ్
తస్సాదియ్యా.. అదరగొట్టిన హన్సిక లేటెస్ట్ అవుట్‌ఫిట్ పిక్స్
రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉన్నాయా ?? హార్ట్ ఎటాక్ రావచ్చు జర భద్రం