రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉన్నాయా ?? హార్ట్ ఎటాక్ రావచ్చు జర భద్రం
Phani CH
11 December 2024
ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు గుండెపోటుతో మరణిస్తున్నారు.. అయితే మీకు కనక రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉంటే కనక వెంటనే అప్రమత్తం అవ్వండి.
రాత్రి పోసుకునే ముందు ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉంటే ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉంటే అని పొరపడి అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
ఛాతీలో అసౌకర్యం లేదా శ్వాస ఆడకపోవడం వంటి వాటి తో పాటు తలనొప్పి, వికారం, అలసట ఉంటే ఇవి గుండెపోటు సంకేతాలు అని భావించి వెంటనే అప్రమత్తం అవ్వాలి.
చలికాలం రాత్రి వేళ బిగుసుకుపోయినట్లు ఒళ్లంతా చెమటలు పడుతుంటే, అది గుండెపోటు లక్షణం కావచ్చు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సంకేతం ఎక్కువగా కనిపిస్తుంది.
శారీరక శ్రమ చేయనప్పుడు లేదా విశ్రాంతిగా ఉన్నప్పుడు ఛాతీ అసౌకర్యంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే అది గుండెపోటు లక్షణం.
కొంతమంది పురుషులకు గుండెపోటు వచ్చే ముందు ఏ కారణం లేకుండా మీరు అకస్మాత్తుగా ఆందోళన చెందుతుంటారు ఇలా ఉంటె వీలైనంత త్వరగా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి.
గుండెపోటు వచ్చేముందు కొంతమందికి ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం.. భుజాలు, మెడ, వీపు, దవడ లేదా కడుపు వరకు వ్యాపిస్తుంది. ఇవి కనిపిస్తే, అది హార్ట్ ఎటాక్ కామన్ సింప్టమ్‌గా భావించాలి.