ఈ చిన్ని చిట్కాలతో దోమలను తరిమికొట్టండి
Phani CH
11 December 2024
మన మనసు ఆహ్లాదకరంగా ఉంచే కాలాల్లో చలికాలం, వర్షాకాలాలు.. అయితే ఈ కాలాల్లో దోమల బెడదను భరించ లేక దోమల మందులు వాడుతుంటారు.
అయితే ఈ దోమలు మందులు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. అయితే ఈ దోమల మందులకు బదులుగా ఇంట్లోనే కొన్ని పదార్ధాలతో ఇంట్లోని దోమలను తరిమి కొట్టచ్చు.
లవంగాలను వంటల్లోనే కాదు దోమలు తరిమి కొట్టడానికి కూడా ఉపయోగిస్తారు. లవంగాలను కాల్చితే వాటి నుండి వచ్చే పొగకారణంగా దోమలు పారిపోతాయి.
ప్రతి ఒక్కరి ఇంట్లో కర్పూరం తప్పనిసరిగా ఉంటుంది అయితే ఈ కర్పూరం ని దంచి నూనెలో వేసి ఆ నూనెని ఒంటికి రాస్తే దోమలు కుట్టే ప్రసక్తే ఉండదు.
ఇప్పుడు కర్పూరం, లవంగాలను కలిపి ఒక చిట్కా ఉపయోగించి దోమల జాడ మన దరిదాపుల్లో కనిపించకుండా చేయచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక చిన్న గిన్నెలో రెండు మూడు కర్పూరాలతో పాటు ఒక నాలుగు ఐదు లవంగాలను పెట్టి కర్పూరాన్ని వెలిగిస్తే దాని నుండి సుగంధాలు విడుదల చేస్తూ పొగవస్తుంది.
ఒక ఐదు నిమిషాల వరకు ఆ పొగ ప్రతి గదిలోకి వచ్చేలా చేస్తే దోమలు దరిదాపుల్లోకి కూడా రావు. ఇక చిన్ని చిట్కాతో మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎంజాయ్ పండగో.. అలాంటి వాటికి సరైన మందు రొమాన్స్..
తస్సాదియ్యా.. అదరగొట్టిన హన్సిక లేటెస్ట్ అవుట్‌ఫిట్ పిక్స్
బ్లాక్ శారీలో మతిపోగొడుతున్న వర్ష అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్