దీన్ని తక్కువగా చూడకండి.. ఇలా చేస్తే వ్యాధులన్నీ పరార్..
12 December 2024
Shaik Madar Saheb
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. అలాంటి వాటిలో అంజీర్ (అత్తిపండు) ఒకటి.. ఆరోగ్య నిపుణులు ఫిగ్ ను దివ్యౌషధంగా పేర్కొంటారు..
ఆయుర్వేదం ప్రకారం.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలలో అత్తిపండ్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అంజీర్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి
అత్తి పండ్లను మాత్రమే కాకుండా, దాని నీటిని తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. ఇలాంటి వ్యక్తులు అంజీర్ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే మంచిది.
అంజీర్ నీరు రక్తపోటు స్థాయిలను నిర్వహించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
అంజీర్ నీటిలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. వీటి నీరు ఎముకలకు అద్భుతమైన టానిక్. ఇది ఎముకలను దృఢంగా ఉంచి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంజీర్ నీటిలోని పొటాషియం రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. అయితే పరిమిత పరిమాణంలో అత్తి పండ్లను లేదా నీటిని తీసుకోవడం మంచిది.
అత్తి పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నానబెట్టిన అత్తి పండ్లను, దాని నీటిని ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల మలబద్ధకం నుంసీ ఉపశమనం లభిస్తుంది.
అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత కూడా దూరమవుతుంది.. వీటి నీరు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
అత్తి పండ్లను ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే తినడంతో పాటు.. నీటిని తాగాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు రెండు లేదా మూడు అంజీర్ ను తినాలి.