12 December 2024
Subhash
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ ను ఆవిష్కరించింది.
వచ్చే నెల 11 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు భారీగా ప్రయోజనాలు పొందవచ్చు.
డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు రీఛార్జ్ కోసం అందుబాటులో ఉండే ఈ ప్లాన్ వినియోగదారులకు భారీగా సేవింగ్స్, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
రూ.2,025 పేరుతో ప్రకటించిన ఈ ప్లాన్ 200 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5జీ సేవలు, రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున లభిస్తుంది.
500 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్-ఎస్‌ఎంఎస్‌లు, దీంతోపాటు రూ.2,150 పార్టనర్ కూపన్ల రూపంలో ప్రయోజనాలు పొందవచ్చునని జియో తెలిపింది.
వీటిలో జియోలో రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై రూ.500 కూపన్‌తోపాటు రూ.499 స్విగ్గీ ఆర్డర్‌పై రూ.150 తగ్గింపు పొందవచ్చు.
అంతేకాకుండా ప్లాన్ తీసుకున్నవారు ఈజ్ మై ట్రిప్‌పై రూ.1,500 తగ్గింపును పొందవచ్చునని జియో తెలిపింది.
ప్రైవేట్ కంపెనీల టారీఫ్ ప్లాన్‌ల ధరలు పెంచడంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. వారిని మరింత ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్‌లను తీసుకువస్తోంది.