Drumstick Leaves: మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. అయితే అదే మునగాకు అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందని తెలుసా? చర్మాన్ని, జుట్టును సంరక్షించే గుణాలు మునగాకులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి, మునగాకు నూనె.. మన సౌందర్య సంరక్షణలో ఎలా సహాయపడతాయో చూద్దాం.
మునగ ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. మునగాకు.. మొటిమల్నీ, మచ్చల్నీ, ముడతల్నీ తగ్గిస్తుంది. ఇందులో నారింజతో పోలిస్తే విటమిన్- సి ఏడురెట్లు ఎక్కువ. అమ్మాయిల్లో అత్యంత సాధారణంగా ఎదురయ్యే మంగు మచ్చల్నీ నియంత్రిస్తుంది. చెంచా మునగాకు పొడిని రెండు చెంచాల పెరుగులో కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక చల్లటినీటితో శుభ్రం చేస్తే సరి. వారానికి రెండుసార్లు చేస్తే సమస్య తగ్గుతుంది. మునగాకు మాత్రమే కాదు.. మునక్కాయ గింజల్లో విటమిన్- ఎ, సి, ఇ లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి కావల్సిన తేమను అందించి మృదువుగా చేస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడేలా చేసి వృద్ధాప్యఛాయలను తగ్గిస్తాయి. జుట్టును తేమగా ఉంచే అమైనో ఆమ్లాలు, ఒలియాక్ ఆమ్లాలు మునగాకులో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి నిస్తేజమైన కురులను జీవాన్నివ్వడంలో సాయపడతాయి. తేమను కోల్పోకుండా చేస్తాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.