12 December 2024

స్టార్ హీరోతో గొడవ.. అతడంటే భయం లేదంటోన్న హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది.

ఆమె ఎవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 

తన డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఇప్పటికే ఆమె బహిరంగ లేఖ రిలీజ్ చేసింది.

తాజాగా ఆమె మరోసారి ఈ వివాదం పై రియాక్ట్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ మాట్లాడుతూ ఆ లేఖ గురించి కామెంట్స్ చేసింది.

ధనుష్ గురించి లేఖ రిలీజ్ చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడగ్గా.. న్యాయమని నమ్మినదాన్ని బయటపెట్టేందుకు ఎందుకు భయపడాలి. ? 

తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డాక్యుమెంటరీ కోసమే అంటున్నారు. 

అందులో నిజం లేదు. వీడియో క్లిప్స్ కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్‌ను కంటాక్ట్ కావడానికి ట్రై చేశాం. విఘ్నేశ్ కాల్స్ చేశాడు. 

సినిమాలో వాడిన వీడియోస్ కోసం మాట్లాడాలనుకున్నాం. కానీ కుదరలేదు. మేము శత్రువులము కాదు. కానీ ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు అని తెలిపింది నయన్.