ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 చిత్రం తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 చిత్రంలో పలు మార్పులు జరగనున్నాయని.. అంతేకాకుండా బన్నీ లుక్ పూర్తిగా మారిపోనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. లొకేషన్స్, విజువల్ ఎపెక్ట్స్, మరిన్ని సాంకేతికత విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. తాజాగా పుష్ప 2 సెట్ నుంచి అల్లు అర్జున్ ఫోటోను షేర్ చేసుకున్నారు సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్. నవంబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని సమాచారం. సాహసం ప్రారంభించబడింది. ధన్యవాదాలు అంటూ బన్నీ ఫోటో షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు. తాజాగా షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.
ఇక బన్నీ ఫోటో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. తమ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించి మెప్పించాడు. అతని ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక మందన్నా నటించింది. పుష్ప 2 చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని భావించారు మేకర్స్. అయితే అనుకోని కారణాలతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దీంతో సినిమా విడుదల కూడా కాస్త ఆలస్యం కానుందని.. వచ్చే ఏడాదిలో పుష్ప 2 రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్సుతన్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.