Shekar Master: రిహార్సల్స్ చేయకుండానే సెట్‏లోకి వచ్చేవారు.. స్టార్ హీరో గురించి శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

May 03, 2022 | 7:18 PM

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్నింటికీ

Shekar Master: రిహార్సల్స్ చేయకుండానే సెట్‏లోకి వచ్చేవారు.. స్టార్ హీరో గురించి శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Shekar
Follow us on

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్నింటికీ హీరోహీరోయిన్లతో అద్భుతమైన స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కళావతి పాటకు సూపర్ స్టార్ మహేష్‏తో సూపర్ స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా కోసం సేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‏గా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శేఖర్ మాస్టర్ హీరో ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్‏ను.. మన స్టార్స్ లో తక్కువ రిహార్సల్స్ చేసేది ఎవరు ? అని ప్రశ్నించగా.. ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‏కు రాలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు రిహార్సల్స్‏కు రాకుండా డైరెక్ట్ సెట్‏లోకి వచ్చేస్తారని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఎంత అద్భుతమైన డ్యాన్సరో చెప్పకనే చెప్పారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో తాను నాటు నాటు సాంగ్ కోసం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..