Mahaan Movie: చియాన్ విక్రమ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మహాన్.. మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Feb 26, 2022 | 9:40 AM

దక్షిణాది సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు, ఛాలెంజింగ్‌ క్యారెక్టర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారారు నటుడు విక్రమ్‌

Mahaan Movie: చియాన్ విక్రమ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మహాన్.. మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Mahaan
Follow us on

Mahaan Movie Making Video: దక్షిణాది సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు, ఛాలెంజింగ్‌ క్యారెక్టర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారారు నటుడు విక్రమ్‌(Vikram) . హిట్స్‌, ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా సినిమాల కోసం ఎంతైనా కష్టపడుతుంటారాయన. ఈ నేపథ్యంలో విక్రమ్‌ నటించిన తాజా చిత్రం ‘మహాన్‌’ (Mahaan). కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. మొదటి సారి తండ్రికొడుకులిద్దరూ జంటగా నటించిన కలిసి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ వేదికగా గతనెల 10న విడుదలైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ ల నటనకు ప్రశంసలందుకుంది. ఇక ఈ సినిమాలో తండ్రీ కొడుకులతో పాటు బాబీ సింహా, సిమ్రన్‌, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కాగా మహాన్‌ సినిమా మేకింగ్‌ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ విడుదల చేసింది. ఇందులో సినిమా కోసం నటీనటులు, టెక్నీషియన్లు పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా విక్రమ్‌, ధ్రువ్‌ లు తమ పాత్రల కోసం తమను తాము మల్చుకున్న తీరను చక్కగా చూపించారు. వారు కెమెరా ముందు చేసిన కఠినమైన స్టంట్లు, ఫీట్లను అభిమానులతో పంచుకున్నారు. మరి చియాన్‌ అభిమానులను అలరించేలా ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. ఇక విక్రమ్‌ తదుపరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. దీంతో పాటు పొన్నియన్‌ సెల్వన్‌, ధ్రువ నక్షత్రం సినిమాల్లోనూ నటిస్తున్నాడీ వర్సటైల్‌ యాక్టర్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..