
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గతేడాది వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. తన కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారీ అత్తా కోడళ్లు. దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటిభోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనతోనే ఈ అత్తమ్మాస్ కిచెన్ పుట్టుకొచ్చిందంటున్నారు సురేఖ- ఉపాసన. ఇందులో భాగంగా అప్పటికప్పుడు పెద్దగా శ్రమ పడకుండా ఈజీగా ఇంటి భోజనం తయారు చేసుకునేలా ఈ ఇన్‌స్టంట్ మిక్స్‌లు రెడీ చేసి అమ్ముతున్నామన్నారు. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడమంటున్నారు. ప్రస్తుతం వీరు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి మరో స్పెషల్ వంటకం చేరింది. అదే సమ్మర్ స్పెషల్ అవకాయ పచ్చడి. ఈ మేరకు అత్తమ్మాస్ కిచెన్‌లోకి ఆవకాయ చేరుస్తున్నట్లు, ఓ వీడియోను పోస్ట్ చేసింది ఉపాసన. అందులో ఉపాసనకు బొట్టు పెట్టి సురేఖ గారు ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ ఈ వీడియోలో చూపించారు. ‘అందరికీ వేసవి సీజన్ పచ్చళ్లు అందుబాటులో ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి’ అని అందులో కోరింది.
‘ఆవకాయ పచ్చడి మాత్రమే కాదు మన సంప్రదాయం. ఈ సీజన్ లో ఆవకాయ పచ్చడితో మీ ముందుకు వస్తున్నాం. ఆహారం అంటే కేవలం పౌష్టికాహారం మాత్రమే కాదు. మన సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకునే మార్గం’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన. ఇక ఈ అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ కావాలనుకునేవారి కోసం వెబ్సైట్ లింక్ ని కూడా జత చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. అలాగేరామ్ చరణ్ పెద్ది షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..