Vishwambhara: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. ‘విశ్వంభర’ గ్లింప్స్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ విశ్వంభర. బింబిసార తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే విశ్వంభర మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Vishwambhara: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. విశ్వంభర గ్లింప్స్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే
Chiranjeevi Vishwambhara Movie

Updated on: Aug 21, 2025 | 6:41 PM

భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సమయంలో ఎన్నో కథలు విన్న ఆయన బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట చెప్పిన సోషియో ఫాంటసీ అడ్వెంచెరస్ కథకు బాగా ఇంప్రెస్ అయ్యారు. విశ్వంభర టైటిల్ తో షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించారు. అయితే ఆ మధ్యన రిలీజ్ చేసిన విశ్వంభర టీజర్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ విషయంలో మెగాభిమానులు బాగా ఫీలయ్యారు. అయితే ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా మరో క్రేజీ అప్డేట్ తో మన ముందుకొచ్చారు విశ్వంభర మేకర్స్. శుక్రవారం (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్వంభర గ్లింప్స్‌ ను రిలీజ్ చేశారు. ‘ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?’ అన్న పిల్లాడి మాటలతో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. ‘ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..’ అంటూ మెగాస్టార్‌ను పరిచయం చేశారు. చిరంజీవి లుక్స్, బీజీఎం, డైలాగులు, యాక్షన్ సీన్స్ ఈ గ్లింప్స్ లో హైలెట్ గా నిలిచాయి. ఇది చూసిన మెగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి భారీ బడ్జెట్ తో  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశ్వంభర సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సౌతిండియన్ బ్యూటీ  త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

కాగా విశ్వంభర సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే వీఎఫ్ ఎక్స్ పనులు ఆలస్యంతో ఈ మూవీ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

విశ్వంభర గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి