Chiranjeevi: “నేను తప్పు చేయను.. చేస్తే ఒప్పుకుంటాను”.. గరికపాటి వ్యవహారం పై స్పందించిన చిరు
చిరు అభిమానుల కోరిక మేరకు ఫొటోలకు పోజులివ్వడం, దాన్ని చూసి గరికపాటి ఫొటోలు ఆపేస్తే ప్రసంగాన్ని కొనసాగిస్తాననడం పెద్ద రచ్చకు దారి తీసింది. అయితే ఈ విషయంలో చిరు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి మధ్య జరిగిన విషయం రోజూ ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. హైదరాబాద్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు అభిమానుల కోరిక మేరకు ఫొటోలకు పోజులివ్వడం, దాన్ని చూసి గరికపాటి ఫొటోలు ఆపేస్తే ప్రసంగాన్ని కొనసాగిస్తాననడం పెద్ద రచ్చకు దారి తీసింది. అయితే ఈ విషయంలో చిరు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్‌కు కూడా అగ్నికి ఆజ్యం పోసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిని పెద్దది చేయవద్దు అంటూ నాగబాబు ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కానీ ఈ వివాదం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ విషయం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
గరికపాటి నరసింహారావు ఇష్యూపై సున్నితంగా స్పందించారు చిరంజీవి. నిజానిజాలు నిలకడమీద తెలుస్తాయి అని నమ్మేవాన్ని నేను..రాజకీయాల్లో ఉన్నపుడు అయినా.. రాజకీయాల్లో వెళ్లాలి అనుకున్నపుడైనా.. నా మీద చాలా మంది చాలా అన్నారు..ఆ తర్వాత వాళ్లే నిజాలు తెలుసుకుని వచ్చి.. అరే ఆ రోజు అలా అన్నామే అన్నారు.. నేను తప్పు చేయను.. చేస్తే ఒప్పుకుంటాను.. నేను రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినపుడు ఒకతను చేసిన కామెంట్స్ నచ్చక కొందరు దాడి చేసారు.. అప్పుడు నా తప్పు లేదని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చున్నాను.. మీ అందరికి గుర్తుండే ఉంటుంది.. ఎంత మంది మనసులు గెలుచుకున్నాను అనేది కావాలి.. నా బ్యాంక్ బ్యాలెన్స్ పక్కన సున్నాలు కాదు. అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. మరి మెగాస్టార్ వివరణతో ఆయినా ఈ వివాదం ముగుస్తుందేమో చూడాలి.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
