Odisha Train Accident: రైలు ప్రమాదంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి.. అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనాలని చిరంజీవి, పవన్‌ పిలువు

|

Jun 03, 2023 | 11:15 AM

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనాలని స్టార్‌ హీరోలు పిలుపునిచ్చారు. ఈ ఘోర దుర్ఘటన వార్త విని షాక్‌ అయ్యానని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు రక్తం అవసరం అవుతుందని, దగ్గర్లోని తన అభిమానులు రక్తదానం చేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి..  అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనాలని చిరంజీవి, పవన్‌ పిలువు
Train Accident In Odisha
Follow us on

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొనాలని స్టార్‌ హీరోలు పిలుపునిచ్చారు. ఈ ఘోర దుర్ఘటన వార్త విని షాక్‌ అయ్యానని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు రక్తం అవసరం అవుతుందని, దగ్గర్లోని తన అభిమానులు రక్తదానం చేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరమని జనసేనాని పవన్ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. 278మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరమని జన సేనాని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక రైలు ప్రమాదంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారు ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తారక్‌ ట్వీట్‌ చేశారు.

కాగా ఇప్పటివరకు 238 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. అలాగే 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఒడిషా రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించారు. రైల్వే మంత్రితో మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధితులకు అవసరమైన సాయమందించాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..