GodFather and BheemlaNayak : ఒకే సెట్‌లో మెగాస్టార్- పవర్ స్టార్.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే వీడియో షేర్ చేసిన మెగాపవర్ స్టార్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. భీమ్లా నాయక్ గా పవన్ రేపే థియేటర్లలోకి రాబోతున్నారు. దాని ముందు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.

GodFather and BheemlaNayak :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. భీమ్లా నాయక్ గా పవన్ రేపే థియేటర్లలోకి రాబోతున్నారు. దాని ముందు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ మూవీలో దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా రేపు ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ సర్ ప్రైజ్ వీడియోను షేర్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలో ఆ సినిమా సెట్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా విజిట్ చేశారు. అది కూడా ఆయన షూటింగ్ చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా డ్రెస్‌లోనే చిరంజీవి ఖైదీ నెం.786 అనే ఖైది డ్రెస్ వేసుకొని పవన్ సెట్ కు వచ్చారు. ఆ సమయంలో పవన్ పోలీస్ గెటప్ లో ఉన్నారు. చిరంజీవి రాకను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తెగ ఎంజాయ్ చేశారు. రానా కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారు. అలాగే తర్వాత గాడ్ ఫాదర్ సెట్స్‌ను పవన్ కళ్యాణ్ విజిట్ చేశారు. ఆయనకు తోడుగా త్రివిక్రమ్ కూడా వచ్చారు ఆ సమయంలో చిరంజీవి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో మాట్లాడుతున్నారు. వారిలో విజయేంద్ర ప్రసాద్, ఆర్.నారాయణమూర్తి వంటి వారు ఉన్నారు. ఈ వీడియో చివరిలో ఆల్ ది బెస్ట్ బీమ్లానాయక్ అని కింద అన్నయ అని ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :




