AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“అందంగా లేవు ఆంటీ”.. నెటిజన్ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చెప్పవే చిరుగాలి హీరోయిన్

ఈ సినిమాలో హీరో వేణును ప్రేమించే అమ్మాయిగా కనిపించిన నటి గుర్తుందా.? ఆమె నటి అభిరామి. ఈ అందాల భామ చెప్పవే చిరుగాలి సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అభిరామి 2001 సంవత్సరంలో అర్జున్ నటించిన వానవిల్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

అందంగా లేవు ఆంటీ.. నెటిజన్ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చెప్పవే చిరుగాలి హీరోయిన్
Abirami
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2024 | 7:50 AM

Share

నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన చెప్పవే చిరుగాలి సినిమా గుర్తుందా.? ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో హీరో వేణును ప్రేమించే అమ్మాయిగా కనిపించిన నటి గుర్తుందా.? ఆమె నటి అభిరామి. ఈ అందాల భామ చెప్పవే చిరుగాలి సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అభిరామి 2001 సంవత్సరంలో అర్జున్ నటించిన వానవిల్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత అభిరామి కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాతో తిరిగి సినీ రంగ ప్రవేశం చేసింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఇదిలా ఉంటే తాజాగా అభిరామి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో 24 ఏళ్లుగా తన మేకప్ మేన్ గా పనిచేస్తున్న ప్రసాద్ ను పరిచయం చేసింది. నాతో 24 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రసాద్‌కి తమిళంలో న అనే అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియదని చెప్పుకొచ్చింది.  నేను చాలా సార్లు ప్రయత్నించాను. కానీ అక్షరాన్ని సరిగ్గా పలకలేకపోయాడు. తరువాత, అతను తన నాలుకను మడతపెట్టి జ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో నేర్పించే వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు అభిరామి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తన మేకప్ మెన్ ను అవమానించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అభిరామి తనదైన శైలిలో స్పందించింది.

‘కెమెరాలో మాట్లాడుతుంటే అందంగా లేవు ఆంటీ మేడమ్‌’ అని ఎవరో అనడంతో.. ‘అప్పుడు చూడకు’ అని అభిరామి కౌంటర్ ఇచ్చింది. ఇంకొకరు ‘‘నటన మానేశారా..? మేకప్ వేసుకోవడం తెలియడంలేదా.?’’ అని కామెంట్ చేశాడు.. దానికి, “నేను అతని వృత్తి పై ఎందుకు దుమ్మెత్తి పోస్తాను.?” అని బదులిచ్చింది. అయితే అభిరామి  వరుసగా నెటిజన్ల కామెంట్స్ కు రిప్లైలు ఇస్తుండటంతో ‘కౌంటర్లు ఇస్తుంది మీరేనా.. మీ అడ్మిన్ కాదా..?’ అని మరొకరు కామెంట్ చేశారు. నాకు సమయం దొరికినప్పుడు సమాధానం ఇస్తాను,” అని తప్పించుకుంది అభిరామి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Abhirami (@abhiramiact)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..