Tollywood: రోడ్డు పక్కన బిచ్చగాడిలా స్టార్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Oct 17, 2024 | 11:15 AM

ఇండస్ట్రీలోనే టాప్ సింగర్. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషలలో వందలాది సాంగ్స్ ఆలపించి శ్రోతలను మంత్రముగ్దులను చేశాడు. 90వ దశకంలో అతడు చాలా ఫేమస్. కానీ ఉన్నట్లుండి రోడ్డు పక్కన బిచ్చగాడిలా మారి కనిపించాడు. ఇంతకీ ఆ స్టార్ సింగర్ ఎవరు.. ? ఎందుకు ఇలా మారిపోయాడు అని తెలుసుకోవాలంటే ఆర్టికల్ చదవాల్సిందే..

Tollywood: రోడ్డు పక్కన బిచ్చగాడిలా స్టార్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..?
Singer
Follow us on

అతడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది శ్రోతల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించాడు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటాడు. అలాగే అతడు మ్యూజిక్ కాన్సర్ట్ కు వందలాది మంది అభిమానులు హజరవుతారు. కానీ ఉన్నట్లుండి ఆ స్టార్ సింగర్ రోడ్డు పక్కన బిచ్చగాడిలా కనిపించాడు. టాప్ సింగర్ ఊహించని లుక్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. నిజానికి ఆ టప్ సింగర్ సరికొత్త ప్రయోగం చేశాడు. ఐదు గంటలపాటు రోడ్డు పక్కన నిలబడి బిచ్చగాడి అవతారంలో పాటలు పాడాడు. అయితే అతడిని ఎవరూ గుర్తించలేదు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? తనే బాలీవుడ్ టాప్ సింగర్ సోనూ నిగమ్.

సోనూ నిగమ్, తెలుగు, హిందీ భాషలలో వందలాది సాంగ్స్ ఆలపించి శ్రోతల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఒకసారి ఆయన చేసిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డు పక్కన బిచ్చగాడిలా నిలబడి దాదాపు ఐదు గంటలపాటు పాటలు పాడారు. 2016లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేదు. అందుకే అప్పట్లో సోనూ నిగమ్ చేసిన ఈ ప్రయోగం అంతగా వైరల్ కాలేదు. కానీ ఇప్పుడు అదే వీడియో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. అందరి దృష్టిని ఆకర్షించింది.

సోనూ నిగమ్ తన లుక్ పూర్తిగా మార్చేసి రోడ్డుపై బిచ్చగాడిలా తిరుగుతూ పియానో వాయిస్తూ పాటలు పాడాడు. ఆయన స్వరానికి ఎందరో ఆకర్షితులయ్యారు. కానీ అతడిని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత సోనూ నిగమ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పుడు సోనూ నిగమ్‌ని కలిశారని అందరికీ తెలిసింది. తనకు డబ్బులు ఇచ్చిన వ్యక్తిని కలుసుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు. సోనూ నిగమ్ షోకు వెళ్లాలంటే వేల రూపాయాలు చెల్లించాల్సిందే. ఒక్కో షోకి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే బిచ్చగాడి గెటప్‌లో ఉచితంగా పాడాడు. కొంతమందికి ఇది ఆసక్తికరంగా అనిపించింది. సోనూ నిగమ్ 90వ దశకం నుంచి సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.