100కు పైగా సినిమాలు.. ఆ హీరోతో ప్రేమ.. కానీ 52 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా

సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్న నటీ నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సితార ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సితార. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది సితార.. తెలుగు, తమిళ్ కలిపి ఆమె 100కు పైగా సినిమాలు చేసింది.

100కు పైగా సినిమాలు.. ఆ హీరోతో ప్రేమ.. కానీ 52 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా
Artist Sitara

Updated on: Aug 27, 2025 | 12:31 PM

టాలీవుడ్‌లో తమ అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్‌లో సితార ఒకరు. సితార 1986లో మలయాళ చిత్రం కావేరితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా 1989లో తమిళ చిత్రం పుదు పుదు అర్థంగల్తో తమిళ సినిమాల్లోకి ప్రవేశించారు. ఇక తెలుగులో 1990లో మనసు మమత చిత్రంతో పరిచయమయ్యారు సితార. ఆ తర్వాత జీవన చదరంగం, గంగ, శ్రీవారి చిందులు, శుక్రవారం మహాలక్ష్మి, మా వారికి పెళ్ళి, అక్క చెల్లెళ్ళు వంటి చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో సహా 100కు పైగా సినిమాల్లో నటించారు, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వివిధ పాత్రలు పోషించారు.

ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో ఆయన చెల్లెలిపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ ఆనే నేను, బృందావనం, అరవింద సమేత, లెజెండ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్న సితార ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు.

డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. చేతినిండా సినిమాలు

 

ఇవి కూడా చదవండి

సితార వయస్సు ప్రస్తుతం 52 ఏళ్ళు, ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. గతంలో ఇంటర్వ్యూలో, ఆమె తన తండ్రి మరణం తర్వాత పెళ్లి గురించి ఆలోచించలేదని, అలాగే తన సన్నిహిత స్నేహితుడు, తమిళ నటుడు మురళి మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయానని చెప్పారు. ఈ రెండు సంఘటనలు ఆమె జీవితంలో పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండడానికి కారణమని ఆమె వెల్లడించారు. ఆమె తన తల్లిదండ్రులతో ఉండాలనే ఆలోచన, సినీ రంగంలో బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు సితార. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదు అని తెలిపింది.

ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.