“మన తెలుగమ్మాయి బ్రదర్, అక్కున చేర్చుకోండి”
ఒకప్పుడు సినిమాల్లో నటించడమే గొప్ప విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సినిమా హిట్ కూడా అవ్వాలి. అప్పుడే అందులో నటించిన నటీనటులకు, ఆ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్లు పేరు వస్తుంది.

ఒకప్పుడు సినిమాల్లో నటించడమే గొప్ప విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సినిమా హిట్ కూడా అవ్వాలి. అప్పుడే అందులో నటించిన నటీనటులకు, ఆ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్లు పేరు వస్తుంది. హిట్టైన సినిమాలో కీలక భూమిక పోషించినప్పుడు క్రెడిట్ ఇవ్వకపోతే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ బాధనే అనుభవిస్తోంది ‘కలర్ ఫోటో’ హీరోయిన్ చాందిని చౌదరి. ఈమె ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘కుందనపు బొమ్మ’, ‘మను’, ‘హౌరా బ్రిడ్జ్’ వంటి సినిమాలు కూడా చేసింది. అయినా కానీ తెలుగు అమ్మాయి అవ్వడంతో పాటు, పెద్దగా గ్లామర్ పాత్రలు వెయ్యదు కాబట్టి పెద్దగా ఎవరూ గుర్తించలేదు. ఇంతమంచి నటికి ఒక మంచి హిట్ పడితే బాగుండు అని ఆమెతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది కోరుకున్నారు. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కలర్ ఫోటో’ సినిమా ‘ఆహా’ ఓటీటీలో విడుదలయ్యి బ్లాక్‌బాస్టర్ హిట్టయ్యింది. ఇందులో చాందిని చేసిన దీప్తి పాత్రకు మంచి స్పందనే వచ్చింది. ప్రేక్షకులపై పాటు విమర్శకులు, తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ చిత్రంపై, మూవీ యూనిట్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే తమ ట్వీట్లలో, పోస్టులలో ఎవరూ చాందిని పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ విషయంపై బాగా హర్టయ్యింది ఈ తెలుగు హీరోయిన్. తన పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతూ వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసిన ఆమె.. ‘సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే అని, ఇది బాధాకరమైన విషయం’ అంటూ ఒక ట్వీట్ వేసింది.
నిజమే..తెలుగు లోగిళ్లలో నుంచి సినిమాల్లోకి ఒక ఆడపిల్ల వెళ్లడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలా వెళ్లిన తర్వాత కూడా గ్లామర్ పాత్రలవైపు మొగ్గు చూపకుండా..పాత్రా ప్రాధాన్యమున్న రోల్స్ మాత్రమే చెయ్యడం ఇంకో అసాధ్యమైన విషయం. అలాంటి అమ్మాయికి అగ్ర తాంబూళం ఇవ్వాల్సిన అవసరం లేదు..తాంబూళంలో ఒక భాగం చెయ్యండి చాలు.
Also Read :