AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: 20 ప్రశ్నలతో కూడిన పేపర్ అల్లు అర్జున్‌కి ఇచ్చిన ఏసీపీ

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ అల్లు అర్జున్‌ విచారణ ప్రారంభమైంది. సంధ్య థియేటర్ కేసులో న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ విచారిస్తున్నారు. సంధ్య థియేటర్‌ కేసులో సోమవారం అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.

Allu Arjun:  20 ప్రశ్నలతో కూడిన పేపర్ అల్లు అర్జున్‌కి ఇచ్చిన ఏసీపీ
Allu ArjunImage Credit source: Nagara Gopal
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2024 | 12:07 PM

Share

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం ఇంటి నుంచి ఒకే కారులో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ వచ్చారు. అల్లు అర్జున్‌ వెంట ఆయన మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీ వాసు కూడా పీఎస్‌కు వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి నుంచి బయల్దేరిన అల్లు అర్జున్‌ విచారణకు వచ్చారు. చిక్కడపల్లి పీఎస్‌లో హాజరయ్యారు.  20 ప్రశ్నలలో సిద్ధం చేసిన పేపర్‌ను అల్లు అర్జున్‌కు ఇచ్చారు ఏసీపీ. అల్లు అర్జున్‌ను విచారిస్తున్న సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ విచారిస్తున్నారు.  ఏసీపీ రమేశ్, సీఐ రాజు సైతం విచారణ సమయంలో పక్కన ఉన్నారు. అల్లు అర్జున్ తన అడ్వకేట్‌తో విచారణకు వచ్చారు.

ఇప్పటికే  సంధ్యా థియేటర్‌లో జరిగిన ఘటనపై  అల్లు అర్జున్‌ తన వెర్షన్‌ చెప్పారు.. బాధిత కుటుంబానికి అండగా వుంటామన్నారు. 25లక్షల ఆర్ధిక సాయం  ప్రకటించారు. ఇక విచారణలో భాగంగా సంధ్యా థియేటర్‌ యాజమాన్యం సహా  A11గా అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు  ఆదేశాలతో   చంచల్‌గూడ జైలుకు తరలించారు.  హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా టెక్నికల్‌ అంశాల నేపథ్యంలో   రాత్రంతా ఆయన జైలులోనే  ఉన్నారు.మర్నాడు  జైలు నుంచి వచ్చాక  కూడా బాధిత కుటుంబానికి అండగా వుంటానని మరోసారి భరోసానిచ్చారు. చట్టంపై గౌరవం వుందని బాధ్యతాయుతంగా విచారణకు సహకరిస్తానన్నారు. కానీ ఆ తరువాత సంధ్యా ధియేటర్‌ ఘటన పొలిటికల్ టర్న్‌ తీసుకుంది. పోస్టుల వ్యవహారం మరింత ఆజ్యం పోసింది.

అంతేకాదు సంధ్యా థియేటర్‌లో  ఘటనకు కారణాలేంటి? ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులు ఎవరు? అనే చర్చతో  పాటు ఈ టోటల్‌ ఎపిసోడ్‌ పొలిటికల్‌ రచ్చగా మారింది. మరోవైపు అన్ని   కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. ఘటన జరిగిన నాటి వీడియోలను రిలీజ్‌ చేశారు. ఇక  ఓయూ జేఏసీ అల్లు అర్జున్‌ ఇంటిని ముట్టడించడం సంచలనం రేపింది. రాజకీయం భగ్గుమంది. మరోవైపు ఆ  దాడి ఘటనలో ఆరుగురిపై కేసు ఫైల్‌ అయింది. ఆ ఆరుగురు బెయిల్‌పై రిలీజయ్యారు.. ఇక దాడి నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంధ్యా థియేటర్‌ ఘటనకు సంబంధించి కేసు విచారణలో ట్విస్టులు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి చిక్కడపల్లి పోలీసుల విచారణపైనే?   బెయిల్‌ రూల్స్‌కు విరుద్ధంగా ప్రెస్‌మీట్‌ పెట్టారనే అంశంపై పోలీసులు ఫోకస్‌ పెట్టారనే చర్చ జరుగుతోంది.  అలాగే  సంధ్య థియేటర్‌కి వెళ్లొద్దని చెప్పిన వెళ్లారని.. ఇప్పటికే లిఖితపూర్వక రుజువులతో సహా ఆధారాలను బయటపెట్టారు. వీడియోలను విడుదల చేశారు. . వాటి ఆధారంగా ప్రశ్నలు సంధించనున్నారా?.. ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాల ప్రాతిపదికగా కొశ్చనరీ సిద్ధం చేశారా? , సోషల్‌ మీడియాలో పోస్టులు ,ఓయూ జేఏసీ ముట్టడి ఇలా  కీలక  అంశాలపై   స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తారా?..నోటీసైతే వచ్చొండాది ..ఇక ఎంక్వయిరీ ఫ్రేమ్‌లో ఏం జరగబోతుంది.  ఔట్‌ పుట్‌ ఎట్టా వుండబోతుందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌.