Unni Mukundan : ఏంటీ సార్.. ఆ మాట చెప్పినందుకే కొట్టేస్తారా.. ? హీరో ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..
సినీరంగంలో నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు... అడ్డంకులు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఓ స్టార్ స్టేటస్ సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత తమ గుర్తింపును కాపాడుకోవడంలో కొందరు స్టార్స్ విఫలమవుతుంటారు. కొన్నిసార్లు తొందరపాటుతో ప్రవర్తించిన పరిస్థితులు.. తమ కెరీర్ పై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఈ స్టార్ హీరో విషయంలోనూ అదే జరుగుతుంది.

మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన తర్వాత హీరో ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు మేనేజర్ విపిన్ కుమార్. కొంతకాలంగా అతడి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల మరో హీరో టోవినో థామస్ కొత్త చిత్రం నరివెట్టను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే తనను హీరో ఉన్ని ముకుందన్ కొట్టాడని మేనేజన్ విపిన్ తెలిపారు. టోవినో థామస్ సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ చేశానని.. నిన్న ఉదయం తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి, పార్కింగ్ స్థలానికి తీసుకెళ్లి, తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్కో సినిమా తర్వాత అతడికి కొత్తగా అవకాశాలు రాకపోవడంతో కొన్ని రోజులుగా ఉన్ని ముకుందన్ మానసిక సంఘర్షణకు గురయ్యారని.. అదే సమయంలో తాను మరో హీరో సినిమాను ప్రశంసించడంతో తనపై దాడి చేశారని అన్నారు. ఉన్ని ముకుందన్ తన సిబ్బందితో ఇలాగే ప్రవర్తిస్తాడని ఆరోపించారు. విపిన్ ఆరు సంవత్సరాలుగా ఉన్ని ముకుందన్ మేనేజర్ గా పనిచేస్తున్నాని.. 18 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని.. చాలా మంది సినిమాలకు తాను పనిచేశానని అన్నారు.
ఉన్ని ముకుందన్ పై తాను ఫిల్మ్ అసోసియేషన్లకు ఫిర్యాదు చేశానని.. అతడి గురించి ఇంకా విషయాలు చెప్పాలని.. తర్వాత వాటిని సుధీర్ఘంగా వివరిస్తానని అన్నారు విపిన్. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో చిత్రం చివరగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఉన్ని ముకుందన్ వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమి కాదు. గతంలోనూ లైంగిక వేధింపుల కేసు, యూట్యూబర్, సీక్రెట్ ఏజెంట్‌పై బెదిరింపులు కేసులలో చిక్కుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




