Actor : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సినిమాలు వదిలేసి డీజేగా మారిన కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సినీరంగంలో నటీనటులగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో... ఆ పేరును కాపాడుకోవడం కూడా అంతే కష్టం. అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని అవకాశాలు అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే పాపులర్ అయిన నటీనటులు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో ఈ కమెడియన్ ఒకరు.

Actor : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సినిమాలు వదిలేసి డీజేగా మారిన కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Actor (1)

Updated on: Nov 03, 2025 | 8:36 AM

సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. తక్కువ సమయంలోనే పాపులారిటీ వచ్చినప్పటికీతర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైనవారు ఉన్నారు. కొంతకాలానికే సినిమాలను విడిచిపెట్టి మరో రంగాన్ని ఎంచుకున్నవారు ఉన్నారు. అందులోకమెడియన్ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేశాడు. తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు ఇండస్ట్రీని వదిలి డీజేగా పనిచేస్తున్నాడు. తాజాగా అతడికి సంబంధించిన వీడియోస్ ఇన్ స్టాలో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

పైన ఫోటోలో డీజేగా కనిపిస్తున్నకమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో పాపులర్ నటుడు. అల్లు అర్జున్ తో కలిసిబ్లాక్ బస్టర్ హిట్ మూవీలో కనిపించాడు. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. అతడి పేరు బబ్లూ. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం సినిమాతో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆనందం, ఎవడి గోల వాడిదే, ఆర్య, చిరుత, బోణీ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఎవడి గోల వాడిదే, ఆర్య చిత్రాలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్ల క్రితం పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

నటుడిగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన కుటుంబంలో ఒక్కొక్కరు వరుసగా చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. ఇంట్లోనే ఉండిపోవడం వల్ల నటనకు దూరమయ్యానని గతంలోఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బబ్లూ. మంచి ఆఫర్స్ వస్తే ఇప్పుడు కూడా నటించేందుకు రెడీగా ఉన్నానని అన్నాడు బబ్లూ. సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఇప్పుడు డీజేగా పనిచేస్తున్నాడు బబ్లూ. అతడి ఇన్ స్టాలో మొత్తం డీజే వీడియోస్ కనిపిస్తున్నాయి. 2006 నుంచి డీజేగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటించిన బబ్లూ.. ఇప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా డీజేగా పనిచేసుకోవడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..