Actress: 14 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఫస్ట్ మూవీకే 10 రూపాయాల రెమ్యునరేషన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం..

భారతీయ సినిమాల్లో ఒకప్పుడు ఆమె తోపు హీరోయిన్. 14 ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఆ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress: 14 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఫస్ట్ మూవీకే 10 రూపాయాల రెమ్యునరేషన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం..
Jayaprada

Updated on: Sep 18, 2025 | 7:45 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో చక్రం తిప్పింది. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 14 ఏళ్లకే అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. డాక్టర్ కాబోయి అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? కొన్ని దశాబ్దాలపాటు సినీరంగంలో చక్రం తిప్పిన ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది. ఆమె మరెవరో కాదండి.. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జయప్రద.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

14 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినీరంగంలోకి అడుగుపెట్టగానే వరుసగా హిట్స్ అందుకుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఒకప్పుడు హీరోయిన్ గా చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతుంది. 1976లో భూమికోసం సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఆమెది కేవలం 3 నిమిషాల పాత్ర. ఆ సినిమాకు జయప్రదకు కేవలం రూ.10 మాత్రమే పారితోషికం ఇచ్చారు. దాదాపు 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో వివిధ భాషలలో కలిపి 300లకు పైగా సినిమాల్లో నటించింది. ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..