Tollywood: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా..
చాలా చిన్న వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ గా నిలిచి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన అందాల రాణి ఆమె. హిందీ, తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ తరగని అందంతో కట్టిపడేస్తుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా..? చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ విజేతగా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కథానాయికగా వరుస సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అక్కినేని నాగార్జునతో చేసిన ఒక్క సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. 1994లో భారతదేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్‌ను అందించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 1996లో శరద్ కపూర్, ముకుల్ దేవ్ లతో కలిసి ‘దస్తక్’ చిత్రంతో తన నటనారంగ ప్రవేశం చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
‘బివి నెం. 1’, ‘మై హూ నా’, ‘మైనే ప్యార్ క్యూ కియా’ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసింది. ‘బివి నెం. 1’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్, ఐఫా, స్క్రీన్, జీ అవార్డులు అందుకుంది. 2006లో, బాలీవుడ్‌కు ఆమె చేసిన విశేష సేవలకు గాను రాజీవ్ గాంధీ అవార్డుతో సత్కరించారు. నాగార్జున సరసన రక్షకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సుష్మిత తన 25వ ఏట తన మొదటి కుమార్తెను దత్తత తీసుకుంది. హైకోర్టులో అనేక కేసులు వేసినప్పటికీ, ఆ నటి తన కుమార్తెను తిరిగి పొందగలిగింది. ఆ తర్వాత, 2010లో, ఆమె తన రెండవ కుమార్తెను దత్తత తీసుకుంది. అనేక స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న సుష్మిత, ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పర్సనల్ విషయాలు, ప్రేమ, రిలేషన్ షిప్ గురించి అనేక వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సుష్మితా.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‌తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
