AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే వందే భారత్ రైలు.. ఈ నెలలోనే ప్రారంభం.. ఈ రూట్లో జర్నీ..

వందే భారత్ అంటేనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా అందరూ గుర్తిస్తారు. కానీ ఈ రైలు మాత్రం అత్యంత నెమ్మదిగా వెళ్లనుంది. ఈ నెల 13వ తేదీన దీనిని ప్రారంభించనుంది. ట్రాక్ సామర్థ్యం కారణంగా తక్కువ వేగంతో ఈ రైలు సర్వీసులు అందించనుంది.

Vande Bharat Express: దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే వందే భారత్ రైలు.. ఈ నెలలోనే ప్రారంభం.. ఈ రూట్లో జర్నీ..
Vande Bharat Express
Venkatrao Lella
|

Updated on: Nov 11, 2026 | 3:21 PM

Share

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అంటేనే అత్యంత వేగంగా వెళ్తాయనే విషయం మనకు తెలిసిందే. వీటిని దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లుగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల మీదుగా వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖ దశలవారీగా ప్రవేశపెడుతోంది. ఈ స్లీపర్ రైళ్లు మరింత వేగంగా గమ్యస్థానానికి చేరుకుంటాయి.  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టారు. అయితే వందే భారత్ అంటేనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు పొందగా.. ఈ వందే భారత్ రైలు మాత్రం అత్యంత నెమ్మదిగా వెళ్లే ట్రైన్‌గా నిలవనుంది. ఈ రైలును నవంబర్ 13వ తేదీన ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. బెంగళూరులో ఈ రైలుకు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

మోదీ చేతుల మీదుగా ప్రారంభం..

బెంగళూరు-మడ్గావ్ వందే భారత్ రైలును నవంబర్ 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 06512 నెంబర్ గల ఈ రైలు ప్రారంభం తేదీన బెంగళూరులో మధ్యాహ్నం 1.30 గంటకు బయల్దేరి.. రాత్రి 9 గంటలకు మంగళూరుకు చేరుకుంటుంది. ఇక తర్వాతి రోజు ఉదయం 2.55 గంటలకు మడ్గావ్‌కు చేరుకోనుంది. ఇక తిరుగు ప్రయాణంలో 06213 నెంబర్ గల రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి.. రాత్రి 9 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రైల్లో మొత్తం16 చైర్ కార్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మడ్గావ్-బెంగళూరు మధ్య ప్రయాణానికి 13 గంటల 20 నిమిషాలు పడుతుంది.  గురువారాలు మినహా వారానికి ఆరు రోజులు పాటు ఈ వందే భారత్ రైలు సర్వీసులు అందించనుంది. నిర్వహణ కోసం ఒకరోజు నిలిపివేయనున్నారు.

అత్యంత నెమ్మదిగా వెళ్లే వందే భారత్ రైలుగా రికార్డ్

ఈ వందే భారత్ రైలు కేవలం గంటకు 55 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణించనుంది. అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల తరహాలోనే వేగం ఉండనుంది. దీంతో దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా ఇది రికార్డ్ సృష్టించనుంది. అయితే ఈ రైలు అందమైన పశ్చిమ కనుమల గుండా ప్రయాణించనుంది. దీంతో ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి ఈ రైలు మంచి ప్రయాణాన్ని అందించనుంది. సకలేష్ పూర్, సుబ్రహ్మణ్య రోడ్ మధ్య ఘాట్ విభాగంలో సుందరమైన ప్రాంతాల గుండా ప్రయాణం సాగించనుంది. ఈ రైలు కర్ణాటక, గోవాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చనుందని అధికారులు చెబుతున్నారు. కుక్కె సుబ్రహ్మణ్య, ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ వంటి ప్రాంతాలకు గుండా ఇది వెళ్లనుంది. ఇది శ్రావణబెళగొళ, హాసన్, మంగళూరు జంక్షన్, ఉడిపి, కుందాపూర్, కార్వార్ వంటి రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ మార్గంలో ట్రాక్ సామర్థ్యం లాంటి కారణాల వల్ల వందే భారత్ రైలు తక్కువ వేగంతో వెళ్లనుంది.

Follow Us