AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇన్నాళ్లకు రీఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. చాలా కాలం తర్వాత ఇటీవల తెలుగులో ఓ మూవీ చేసింది. అంతేకాదు ఆమె టాలీవుడ్ స్టార్ హీరో మరదలు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా.. ? సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పాత ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇన్నాళ్లకు రీఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Shilpa Shirodkar
Rajitha Chanti
|

Updated on: May 06, 2026 | 6:21 PM

Share

సాధారణంగా సోషల్ మీడియాలో చిన్ననాటి జ్ఞాపకాలు, త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. తమ బాల్యం జ్ఞాపకాలు పంచుకుంటూ మురిసిపోతుంటారు చాలా మంది. ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే.. తమ ఆ పాత మధుర స్మృతులను షేర్ చేస్తుకుంటూ తమ అభిమానులకు చిన్న పజిల్ సైతం విసురుతుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మరదలు, ఒకప్పటి క్రేజీ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న ఆ అందాల రాశి ఎవరో గుర్తుపట్టారా. ? ఆమె సోదరి తెలుగులో క్రేజీ హీరోయిన్. అంతేకాదు తెలుగు పాన్ ఇండియా హీరో భార్య. అంటే పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్.. టాలీవుడ్ హీరో మరదలు. ఆమె మరెవరో కాదు.. శిల్పా శిరోద్కర్. గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పాత జ్ఞాపకాలను పంచుకుంది. ఇండోర్ లో జరిగిన లైవ్ షో ఫోటోస్ అంటూ రాసుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

శిల్పా శిరోద్కర్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవల తెలుగులో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన జటాధర చిత్రంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. శిల్పా శిరోద్కర్ సోదరి మరెవరో కాదు.. నమ్రత శిరోద్కర్. తెలుగులో వంశి, అంజి వంటి చిత్రాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది నమ్రత. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది నమ్రత.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు మహేష్. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

శిల్పా శిరోద్కర్ ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్