Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. చాలా కాలం తర్వాత సినిమాల్లో తిరిగి యాక్టివ్ అయ్యింది ఈ వయ్యారి. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
Samantha

Updated on: Nov 22, 2025 | 11:51 AM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని సాధారణ అమ్మాయి. ఇప్పుడు సినీరంగంలో తనదైన ముద్రవేసింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించింది. ఒకప్పుడు డబ్బులు లేక స్కూల్ మానేసిన అమ్మాయి.. ఇప్పుడు నిమిషానికి కోట్లు సంపాదిస్తుంది. అంతేకాదు.. అప్పట్లో అందంతో క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమంత. తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

అటు కథానాయికగా నటిస్తూనే.. ఇటు స్పెషల పాటలతో రచ్చ చేసింది. సినిమాలో 3 నిమిషాలు ఉండే స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంది సామ్. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు ఆమె డబ్బులు లేక చదువులు మధ్యలోనే ఆపేసింది. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసి.. మొదట్లో షాపింగ్ మాల్స్ కోసం యాడ్స్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యింది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

మానసిక సంఘర్షణ, అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ల బాధపడిన సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటుంది. ప్రస్తుతం తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తుంది. 15 సంవత్సరాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉన్న సామ్.. న్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దళపతి, సూర్య వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..