
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్. ఆమె తన కెరీర్‌లో ఇప్పటివరకు 200 కి పైగా చిత్రాలలో నటించింది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది. ఆమె తండ్రి, సోదరుడు, సోదరి అందరూ సినిమా పరిశ్రమకు చెందినవారే. ఈ కుటుంబం మొత్తం సినిమాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ సైతం ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన సినిమాలో ప్రధాన పాత్రలో తన కెరీర్‌ను ప్రారంభించింది. తన అద్భుతమైన నటన, నృత్యంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
ఈ అమ్మాయి మరెవరో కాదండి.. తమిళ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్. తమిళ చిత్ర పరిశ్రమ, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు MR రాధ కుమార్తె. నటుడు శరత్ కుమార్ భార్య. రాధిక తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. రాధిక శరత్ కుమార్ నటి మాత్రమే కాదు, సినీ నిర్మాత, చిత్ర దర్శకురాలు, రాజకీయ నాయకురాలు. తమిళం, తెలుగు భాషలలో సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో పాటు హిందీ, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా పనిచేస్తుంది. ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. రాధిక ఇప్పటివరకుజాతీయ చలనచిత్ర అవార్డు, రెండు నంది అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ అందుకున్నారు. ఆమె మూడుసార్లు వివాహం చేసుకుంది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
ఈ నటి మొదట ప్రతాప్ పోతన్‌ను వివాహం చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె రిచర్డ్ హార్డీని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రాయన్ హార్డీ అనే కుమారుడు ఉన్నాడు. కానీ కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నటుడు శరత్‌కుమార్‌ను మూడవ వివాహం చేసుకున్నారు. వీరికి రాహుల్ శరత్‌కుమార్ అనే కుమారుడు ఉన్నాడు.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..