
పైన ఫోటోలో బొద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంలో ముందుంటారు. అతడి డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఆటోమెటిక్ గా నవ్వేస్తుంటాం. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు సినీరంగంలో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీడియోలు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే పాపులారిటీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్వులు పంచాడు. అలాగే సినిమాల్లో స్టార్ హీరోలకు స్నేహితుడిగా కనిపించాడు. తన నటనతో నవ్విస్తాడు.. అలాగే ప్రతి ప్రేక్షకుడిని కన్నీళ్లు పెట్టిస్తాడు. ఇక అతడు వేసే పంచ్ డైలాగ్స్ కు అడియన్స్ పడి పడి నవ్వాల్సిందే. ఇంతకీ ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ? అతడే వైవా హర్ష. యూట్యూబ్ లో వైవా కాన్సెప్ట్ వీడియోలతో జనాలను నవ్వించాడు.
వైవా హర్షగా యూట్యూబర్ గా పాపులర్ అయ్యాడు. వైవా గురించి వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ లో అతడి యాక్టింగ్ అదిరిపోయింది. దీంతో సినిమా అవకాశాలు వచ్చాయి. 2013లో మసాలా సినిమాతో సిల్వర్ స్కీన్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ త్రవాత మైనే ప్యార్ కియా, పవర్, గోవిందుడు అందరివాడేలే, రాజా ది గ్రేట్, జై లవకుశ, తొలిప్రేమ, తేజ్ ఐ లవ్యూ, భానుమతి అండ్ రామకృష్ణ, కార్తీకేయ 2, బింబిసార వంటి చిత్రాల్లో నటించారు. అలాగే త్రీ రోజెస్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోనూ సత్తా చాటాడు.
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగానూ అలరించాడు హర్ష. సుందరం మాస్టర్ సినిమాతో హీరోగాను మెప్పించాడు. ఇటీవల విడుదలైన ప్రసన్న వదనం, ఆ ఒక్కటి అడక్కు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి మెప్పించాడు. ప్రస్తుతం హర్షకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..