Tollywood : ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ హీరో.. కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. అతడి భార్య సైతం స్టార్ హీరోయిన్..
సాధారణంగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈమధ్యకాలంలో సౌత్ సినీస్టార్స్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషలలోనూ అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి భార్య సైతం స్టార్ హీరోయిన్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరలవుతుంది. అందులో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టగలరా.. ? తమిళంలో అతడు క్రేజీ హీరో. అలాగే అతడి భార్య సైతం స్టార్ హీరోయిన్. హీరోయిజం సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? సినిమా నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎంజీఆర్ కు సినిమా ప్రపంచంతో ఎప్పుడూ అనుబంధం ఉండేది. ఆయన ఫిల్మ్ ఫెస్టివల్స్ కు హాజరయ్యేవాడు. ఆయనకు పిల్లలంటే కూడా చాలా ఇష్టం. పై ఫోటోలో ఎంజీఆర్ చేతిలో ఉన్న చిన్నోడు మరెవరో కాదు.. హీరో సూర్య. తమిళ్ నటుడు.. సూర్య తండ్రి శివకుమార్ 100వ చిత్రం “రోసపు రవిక్కైకరి” విడుదల సమయంలో తీయబడిన ఫోటో ఇది. ఇది 1979 నాటిది. MGR ఈ సినిమా విడుదల వేడుకకు హాజరయ్యారు. అప్పుడే సూర్యను ఎత్తుకుని ఫోటో దిగారు.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
సూర్య.. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరో. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ హీరోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య చివరగా రెట్రో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరుప్పు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో త్రిష, ఇంద్రన్స్ నటిస్తుండగా.. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
ఇదిలా ఉంటే. సూర్య సతీమణి జ్యోతిక సైతం క్రేజీ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో నటించారు జ్యోతిక. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సూర్య, జ్యోతిక కొన్నాళ్లపాటు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
