
పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లెవల్లో అత్యధిక డిమాండ్ ఉన్న డైరెక్టర్. కేవలం మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ చేశాడు. ఒక్కో సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇటీవల ఆయన తెరకెక్కించిన ఓ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సినిమా ఇంకా పట్టాలెక్కకుండానే నిత్యం వార్తలలో నిలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ చేసే గారడీలకు డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ ఘటూగానే కౌంటరిచ్చారు ఈ డైరెక్టర్. ఈ దర్శకుడు ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయింటుంది. అతడు మరెవరో కాదండి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. పాన్ ఇండియా మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యారు. ఈ సినిమా హీరోగా విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పింది. దీంతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సందీప్. ఇక ఇటీవలే రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే కొన్ని రోజులుగా ఈ మూవీ పేరు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వర్సెస్ దీపికా పదుకొణె అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..