
పై ఫొటోలో మ్యాజిక్ చేస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. అలాగనీ ఈ డైరెక్టర్ పెద్దగా సినిమాలు చేయలేదు. 2014లో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇప్పటివరకు మూడు సినిమాలు తీశాడు. అందులో ఒకటి ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ డైరెక్టర్ ఇప్పటివరకు తీసిన రెండు సినిమాలు మాత్రం వేరే లెవెల్. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. అందుకే ఈ యంగ్ డైరెక్టర్ కు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంది. ఈ అబ్బాయిది రాయల సీమ. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగాడు. చదువుల్లోనూ బాగా చురుకు. అయితే సీఏ చేస్తోన్న సమయంలోనే ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశాడు. 17 ఏళ్ల వయసులోనే షార్ట్ ఫిల్మ్స్ తీసి తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. సుమారు 30కు పైగా లఘు చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. రెండో సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మూడో సినిమాతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
గత కొన్ని రోజులుగా ఈ డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఎందుకంటే అతను డైరెక్ట్ చేసిన ఒక సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నెట్టింట ఈ క్రేజీ డైరెక్టర్ పేరు తెగ మార్మోగిపోతోంది. మరి అతనెవరో గుర్తు పట్టారా? త్వరలోనే పవన్ కల్యాణ్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. అతను మరెవరో కాదు ఓజీ డైరెక్టర్ సుజిత్. ఇది అతని చిన్ననాటి ఫొటో.
పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ సుజిత్
రన్ రాజా రన్, సాహో చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుజిత్. ఇప్పుడు ఓజీతో మరోసారి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయడానికి ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.