
బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. చిన్నప్పుడే మహానటి సావిత్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా వెండితెరకు పరిచయమై స్టార్ స్టేటస్ అందుకున్నాడు. 1960 తర్వాత నటించడం ప్రారంభించిన తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్ అతడు. బాలనటుడిగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించాడు. అతను పని చేయడమే కాకుండా ఆ ప్రాంత భాష, సంస్కృతిని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాడు. దీంతో ప్రతి పాత్రలోనూ నటించడం కాదు… జీవిస్తాడు. అతడు ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి భాషలను కూడా నేర్చుకున్నాడు. దాదాపు 65 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో చురుగ్గా ఉన్న ఈ వ్యక్తికి ఇప్పుడు 70 సంవత్సరాలు. ఇప్పటికీ వరుస సినిమాలతోనూ బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లోనే అతడు సూపర్ స్టార్. తన కెరీర్‌లో 200 కి పైగా సినిమాలు చేసాడు. గత 65 సంవత్సరాలుగా ప్రజల హృదయాలను ఏలిన ఈ కుర్రాడు ఇప్పటికీ సినిమాల్లో సూపర్ స్టార్. కానీ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విడాకులు తీసుకున్నాడు.. ఆ తర్వాత ఓ స్టార్ హీరోయిన్ తో సహజీవనం చేశాడు. చివరకు ఆమెతోనూ విడిపోయి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు. అతడు ఎవరో తెలుసా.. ?
కమల్ హాసన్ 1960లో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే తమిళ చిత్రంతో బాల నటుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1975లో తమిళ చిత్రం ‘పొట్టం పుచ్చి’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, 1981లో ‘ఏక్ దుజే’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కమల్ హాసన్ గొప్ప నటుడిగానే కాకుండా, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, గాయకుడిగానూ మెప్పించారు. కమల్ హాసన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఒకరు సారిక.. మరొకరు వాణి గణపతి. కానీ ఈ రెండు పెళ్లిళ్లు నిలవలేదు. అంతకు ముందు సీనియర్ శ్రీవిద్యను ప్రాణంగా ప్రేమించారు కమల్ హాసన్. కానీ వీరి ప్రేమకు విధి కలిసిరాలేదు. కమల్ హాసన్ 1987లో 24 సంవత్సరాల వయసులో నృత్యకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన పదేళ్లకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ సారికను పెళ్లి చేసుకున్నారు. వీరికి 1986 జనవరి 28న శ్రుతి హాసన్ జన్మించింది. ఆ తర్వాత 1991లో రెండవ కుమార్తె అక్షర జన్మించింది. కొన్నాళ్లకు వీరిద్దరు విడిపోయారు.
ఆ తర్వాత మరో హీరోయిన్ గౌతమితో సహజీవనంలో ఉన్నారు కమల్ హాసన్. కానీ అప్పటికే గౌతమి ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి పాప జన్మించింది. తర్వాత భర్తతో విడాకులు తీసుకున్న గౌతమి .. కమల్ హాసన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. కానీ వీరిద్దరు బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో కమల్ ఒంటరిగా ఉంటున్నారు. దేశంలో రూ. 1.5 కోట్లు ఫీజు వసూలు చేసిన మొదటి స్టార్ ఆయనే.. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నాడు. ఏడు చిత్రాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఏకైక భారతీయ నటుడు కమల్ హాసన్.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..