
తెలుగులో నిర్మాతగా రాణిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీ వాస్. హిట్స్ ఫ్లాప్స్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు బన్నీ వాస్. ఈ ఏడాది తన నిర్మాణంలో వచ్చిన మిత్రమండలి చిత్రం గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాస్ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిర్మాత బన్నీ వాస్ మిత్రమండలి అనూహ్య పరాజయం గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం తండేల్ నుంచి ఈషా వరకు పలు విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పాలుపంచుకున్న బన్నీ వాస్‌కు మిత్రమండలి నిరాశను మిగిల్చింది. తాను, ఇతర నిర్మాతలు కలిసి మిత్రమండలికి పెట్టుబడి పెట్టామని, చిత్రంలో వినోదానికి లోటు ఉండదని గట్టిగా నమ్మామని బన్నీ వాస్ పేర్కొన్నారు.
ఎడిటింగ్ రూమ్‌లో సినిమాను చూసినప్పుడు తామంతా చాలా సంతోషంగా ఉన్నామని, దర్శకుడు వంశీ కూడా చిత్రాన్ని చూసి సినిమా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అయితే, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన తమ అంచనాలకు రివర్స్ లో ఉందని బన్నీ వాస్ ఒప్పుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత, తాను థియేటర్లలో చిత్రాన్ని చూస్తున్నప్పుడు, సాధారణంగా ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతారని తాను మార్క్ చేసుకున్న సన్నివేశాల వద్ద ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏదో లోపం జరిగిందని అర్ధమైందని అన్నారు. నవ్వు అనేది రాలేదు. ఏదో మిస్ అయ్యింది అని బన్నీ వాస్ అన్నారు. ఈ లోపం ఎడిటింగ్, ముఖ్యంగా ఆర్‌ఆర్ (రీ-రికార్డింగ్/బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) లో జరిగిందని తాను గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పొరపాటు తనదేనని 100 శాతం బాధ్యత తీసుకున్నారు.
చివరి మూడు రోజులు తాను ఊరిలో వల్ల ఫైనల్ కాపీని చూడలేకపోయాను అన్నారు. మిక్సింగ్ థియేటర్‌లో సరిదిద్దగలిగే ఈ చిన్న లోపాన్ని తాను చూసి ఉంటే తప్పకుండా సరిదిద్దేవాడినని బన్నీ వాస్ చెప్పారు. ఈ సినిమా వల్ల మొత్తం రూ. 6 కోట్ల నష్టం వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇండస్ట్రీలో సాఫ్ట్‌గా, గౌరవంగా మాట్లాడే వ్యక్తిగా బన్నీ వాస్‌కు మంచి పేరు ఉంది. అయితే, ఈ సంవత్సరం ఆయన చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీని పై ఆయన మాట్లాడుతూ.. తనతో సన్నిహితంగా ఉండేవారికి కోపం వచ్చినప్పుడు తాను ఎంత దూకుడుగా ఉంటానో తెలుసని ఆయన అన్నారు. స్టేజ్‌పై తాను సంయమనంతో ఉన్నప్పటికీ, కొన్ని విషయాలు నాకు కోపం తెప్పించాయి.. అందుకే నేను దూకుడుగా మాట్లాడా అని అన్నారు బన్నీ వాస్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.