Rocking Rakesh: మాజీ సీఎం చేతుల మీదుగా ‘కేసీఆర్’ మూవీ సాంగ్ లాంచ్‌.. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ ఎమోషనల్

చాలామంది జబర్దస్త్ నటుల్లాగానే రాకింగ్‌ రాకేష్‌ కూడా ఏకంగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనున్నాడు . ఆయన హీరోగా తెరకెక్కించిన చిత్రం KCR (కేశవ చంద్ర రమావత్‌). గతేడాది ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న కేసీఆర్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Rocking Rakesh: మాజీ సీఎం చేతుల మీదుగా కేసీఆర్ మూవీ సాంగ్ లాంచ్‌.. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ ఎమోషనల్
Jabardasth Rocking Rakesh

Updated on: Jun 03, 2024 | 8:42 AM

బ‌జ‌ర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ కమెడియన్లలో రాకింగ్ రాకేష్‌ ఒకరు. ఈ షోలో ఒక చిన్న కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అతను తనదైన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. తన కామెడీ ట్యాలెంట్‌తో జబర్దస్త్‌ షోలో టీమ్‌ లీడర్‌గా కూడా ఎదిగాడు. ఇప్పుడు చాలామంది జబర్దస్త్ నటుల్లాగానే రాకింగ్‌ రాకేష్‌ కూడా ఏకంగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనున్నాడు . ఆయన హీరోగా తెరకెక్కించిన చిత్రం KCR (కేశవ చంద్ర రమావత్‌). గతేడాది ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న కేసీఆర్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి తెలంగాణ తేజం పాటను మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందు కోసం నటుడు రాకింగ్‌ రాకేశ్‌, తన భార్య జోర్దార్ సుజాతతో కలిసి హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వచ్చారు. వీరితో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేష్ లు ఉన్నారు. ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణ తేజం పాటను గోరెటి వెంకన్న రాయగా.. సింగర్స్‌ మనో, కల్పన, గోరెటి వెంకన్న ఆలపించారు.కాగా గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య హీరోయిన్‌గా నటిస్తుండగా, తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్‌ సీనియర్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ధనరాజ్, తాగుబోతు రమేష్, రచ్చ రవి, జోర్దార్ సుజాత, కనకవ్వ, రైజింగ్ రాజు, సన్నీ, ప్రవీణ్, లోహిత్ తదితరులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. బలగం మధు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మాజీ సీఎం కేసీఆర్ తో జబర్దస్త్ రాకింగ్ రాకేశ్ దంపతులు..

‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అమరవీరులకి వందనాలు. నేను కన్న కల నా సినిమా ఈరోజు నన్ను అక్కడ నిలబెట్టింది మీ అందరి ఆశీర్వాదాలతోక చరిత్రను ఉద్యమయోధున్ని కారణజన్మున్ని చూశాను ముట్టుకున్నానుజ నేను నటించిన కేశవ చంద్ర రామవత్(KCR) ఈ చిత్రంలో మొదటి తెలంగాణ వీరుల పాట మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. KCR గారు నాకు రెండు గంటల సమయం ఇచ్చి నాతో నా సినిమా గురించి మాట్లాడటం జీవితంలో మర్చిపోలేని సందర్భం. ఎన్నాళ్ళ నా సినిమా కష్టం తీరిపోయింది. ఇదంతా మీ ఆశీర్వాద బలం’ అని ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చాడు రాకింగ్ రాకేష్‌.

కేసీఆర్ సినిమాలో రాకింగ్ రాకేశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.