Brahmanandam: రెబల్‌ స్టార్‌ దంపతులకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌.. ఫొటోలు వైరల్‌..

|

Oct 30, 2021 | 4:22 PM

తనదైన హాస్యంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన వరసగా..

Brahmanandam: రెబల్‌ స్టార్‌ దంపతులకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌.. ఫొటోలు వైరల్‌..
Follow us on

తనదైన హాస్యంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన వరసగా సినిమాలు చేయడం లేదు. సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని చిత్రకళకు వెచ్చిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ కాలంలో ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్‌ వేసిన హాస్య బ్రహ్మ… వాటిని చిరంజీవి, రానా, అల్లు అర్జున్‌ తదితర హీరోలకు బహుమతిగా అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా తను గీసిన షిర్డీ సాయిబాబా చిత్రపటాన్ని రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు దంపతులకు బహుమతిగా ఇచ్చారు బ్రహ్మానందం.

ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న కృష్ణం రాజు.. ‘మన కామెడీ జీనియస్‌ చిత్రకళలోనూ జీనియస్సే. అద్భుతమైన ట్యాలెంట్‌ కలిగి మంచి మనసున్న వ్యక్తి బ్రహ్మానందం. ఈ ప్రత్యేకమైన బహుమతిని నాకు అందజేసినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మానందం ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగ మార్తాండ’ అనే చిత్రంలో నటిస్తున్నారు

Also Read:

Kajal Aggarwal: పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..

Puneeth Raj Kumar: పునీత్ పార్దీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలకృష్ణ.. అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం.