NTR: ఈ ఫీలింగ్ ఏంట్రా.. గుండె ఎదో వణుకుతున్నట్టు ఉందిరా..! ఎన్టీఆర్ పోస్ట్‌పై బ్రహ్మీ ఫన్నీ రిప్లే

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు.

NTR: ఈ ఫీలింగ్ ఏంట్రా.. గుండె ఎదో వణుకుతున్నట్టు ఉందిరా..! ఎన్టీఆర్ పోస్ట్‌పై బ్రహ్మీ ఫన్నీ రిప్లే
Ntr, Brahmanandam

Updated on: Feb 17, 2025 | 9:50 AM

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్రహ్మ ఆనందం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత శుక్రవారం బ్రహ్మ ఆనందం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం రోజున (ఫిబ్రవరి 14న) విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం, అలాగే గౌతమ్, వెన్నలకిషోర్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కామెడీ సీన్స్ లోనే కాదు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించి మెప్పించారు అని కొనియాడుతున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మానందం సినిమాను ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ షేర్ చేశారు.

సినిమా గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను. రాజా గౌతమ్, బ్రహ్మానందం గారికి, టీమ్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు అంటూ తారక్ పోస్ట్ చేశారు దానికి బ్రహ్మానందం రిప్లే ఇస్తూ.. థాంక్యూ సోమచ్ నాన్న ” ఈ ఫీలింగ్ ఏంట్రా గుండె ఎదో వణుకుతున్నట్టు ఉందిరా.. ” అంటూ అదుర్స్ సినిమాలోని డైలాగ్ రాసుకొచ్చారు బ్రహ్మానందం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి