Brahmamudi Serial: వామ్మో.. దడ పుట్టిస్తోన్న అత్తాకోడళ్లు.. ఒక్క ఎపిసోడ్ కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. లెక్కలు తెలిస్తే..

కావ్య.. అలియాస్ దీపికా రంగరాజు.. ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా మారుమోగుతున్న పేరు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కావ్య.. ఆ తర్వాత పలు షోలలో తన కామెడీ పంచులతో మరింత ఫేమస్ అయ్యింది. తాజాగా ఈ సీరియల్ కోసం కావ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Brahmamudi Serial: వామ్మో.. దడ పుట్టిస్తోన్న అత్తాకోడళ్లు.. ఒక్క ఎపిసోడ్ కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. లెక్కలు తెలిస్తే..
Brahmamudi

Updated on: Apr 12, 2025 | 8:09 AM

బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కు తెలుగు అడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కార్తీక దీపం 2 సీరియల్ కు గట్టిపోటీనిస్తూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సీరియల్లో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే షర్మిత గౌడ, నైనిషా రాయ్, శ్రీప్రియ శ్రీకర్, గిరి శంకర్ కీలకపాత్రలలో నటిస్తూ తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ సిరీయల్ కోసం ప్రధాన పాత్రధారులతోపాటు మిగతా నటీనటులు సైతం భారీగానే పారితోషికాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సీరియల్లో రాజ్ కంటే ఎక్కువ కావ్యకే రెమ్యునరేషన్ వస్తున్నట్లు సమాచారం.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సీరియల్లో హీరోగా నటిస్తోన్న మానస్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.30 వేలు పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే నెలలో సుమారు ఇరవై రోజుల వరకు బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ లో మానస్ పాల్గొననున్నట్లు సమాచారం. అంటే నెలకు ఈ సీరియల్ ద్వారా దాదాపు రూ.7 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక ఇందులో రాజ్ కంటే ఎక్కువ కావ్యకే పారితోషికం వస్తుందట. అంటే దీపికా రంగరాజు ఎక్కువగా తీసుకుంటుందట. దీపికా ఒక్క రోజు ఎపిసోడ్ కోసం రూ.35 వేల వరకు పారితోషికం తీసుకుంటుందట. అంటే నెలకు పది లక్షలకు పైగానే ఉంటుందట.

ఇక ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తోన్న రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ సైతం రాజ్, కావ్య పాత్రలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ కావ్య, రాజ్ లకు గట్టిపోటీనిస్తుంది షర్మిత. తాజా సమాచారం ప్రకారం షర్మిత ఒక్క రోజు ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.20 వేలు పారితోషికం తీసుకుంటుందట. అంటే నెలకు రూ.7 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?