బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న హౌస్ మేట్స్ చాలా మంది ప్రేక్షకులకు తెలియనివారే ఉన్నారు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అంతో ఇంతో కంటెంట్ ఇస్తున్న వారు కొంతమంది ఉన్నారు వారిలో నాగ మణికంఠ ఒకరు. మనోడు హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. మణికంఠను కదిలిస్తే ఏడుస్తున్నాడు. ఎవరు మాట్లాడటానికి వచ్చిన ఎమోషనల్ అవుతున్నాడు. తన కష్టాలు గుర్తు చేసుకుంటూ ఒక్కడే బాధపడుతూ.. హౌస్ లో ఒంటరిగా తిరుగుతున్నాడు. అయితే నామినేషన్స్ సమయంలో బాగా ఎమోషనల్ అయిన నాగమణికంఠ ఒక్కసారిగా తన విగ్గు తీసి అందరికి షాక్ ఇచ్చాడు. దాంతో ప్రేక్షకులు కూడా అవాక్ అయ్యారు. ఓర్నీ నీది విగ్గా.. అని షాక్ అయ్యారు. అయితే నాగమణికంఠ విగ్గు పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి.
తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న షోలో నాగమణికంఠ విగ్గు గురించి కామెడీ చేశారు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయిన కావ్య అలియాస్ దీపిక రంగరాజు. ఓ షోలో నాగమణికంఠలానే దీపిక కూడా నేను ఇంతకన్నా ట్రాన్స్ ప్లాంట్ గా ఉండలేను అంటూ తల పై ఉన్న విగ్గు తీసి కామెడీ చేసింది. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ పోమో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మాయి బదులు నేను ఉండి ఉంటే.. మస్త్ కంటెంట్ ఇచ్చేదాన్ని అని నీకు ఎవర్ని చూస్తే అనిపించింది అని శ్రీముఖి అడగ్గా.. నిఖిల్.. నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేను’ అంటూ విగ్ తీసి.. మణికంఠను ఇమిటేట్ హెసింది దీపికా.
దాంతో సొంత ఛానెల్ వాళ్లే ఇలా చేస్తే ఎలా.. అతను తన బాధను చెప్పుకొని ఏడుస్తుంటే మీకు కామెడీగా ఉందా.? అంటూ నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. దాంతో దీపికా ఓ వీడియో విడుదల చేసింది. తాను మణికంఠను ఎమోషనల్‌గా హర్ట్ చేయాలని అలా చేయలేదు అని చెప్పింది. నేను కూడా విగ్ పెట్టుకుంటాను కాబట్టే.. స్టేజ్‌పై అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. అదో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్.. ఆ విగ్ పీకి పక్కనపెట్టడానికి ఎన్ని టేక్‌లు తీసుకుని ఉంటుందో.. ఆ డైలాగ్‌లు ఎవరు అందిస్తారో.. అక్కడున్న వాళ్లకే కాదు.. చూసే వాళ్లకి కూడా తెలుసు అని క్షమాపణలు చెప్పింది దీపికా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.