Kannappa: కన్నప్ప సినిమా పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం.. ఆ సీన్స్ తొలగించాలని డిమాండ్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రం కన్నప్ప. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఒక భారీ పాన్-ఇండియా సినిమా కన్నప్ప. ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు, ‘మహాభారతం’ కు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖేష్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నప్ప పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) విడుదల కానుంది.
ఇక ఈ సినిమాలో అతిథి పాత్రలలో ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతి), మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ (కథానాయిక), మధుబాల, బ్రహ్మానందం, రఘు బాబు తదితరులు నటిస్తున్నారు. సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించబడింది, 90 రోజుల మొదటి షెడ్యూల్ అక్కడ జరిగింది. 800 మంది సిబ్బందితో, 8 కంటైనర్ల మెటీరియల్‌తో భారీ స్థాయిలో షూటింగ్ జరిగింది. ఇప్పటికే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్న మూవీ టీమ్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది.
కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన ‘పిలక’, ‘గిలక’ పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తున్నాయని, సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. గుంటూరులో జరగనున్న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ హెచ్చరించారు, అలాగే పిలక, గిలక పాత్రలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని పై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.